జొన్న రొట్టె తింటున్నారా? ఏమౌతుందో తెలుసా?
పట్టణాల సంగతి పక్కన పెడితే ఊర్లలో ఉండేవారు ఎక్కువగా జొన్న రొట్టెనే తింటుంటారు. జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. అసలు జొన్న రొట్టెను తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

జొన్న రొట్టె
అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తింటే బరువు పెరగడంతో పాటుగా రక్తంలో చక్కెర కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది అన్నాన్ని తగ్గించి రొట్టెలను తింటుంటారు. ముఖ్యంగా జొన్న రొట్టెను. నిజానికి రైస్ కంటే జొన్న రొట్టెనే ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తింటే బరువు పెరిగిపోతామన్న భయం ఉండదు. అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
జొన్న రొట్టెను ఇప్పుడు కాదు ఎన్నో ఏండ్ల నుంచి తింటున్నారు. చాలా మంది ఇండ్లలో ఉదయం, రాత్రిళ్లు జొన్న రొట్టెనే తింటుంటారు. నిజానికి జొన్న రొట్టె బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.
జొన్న రొట్టెలోని పోషకాలు
జొన్న రొట్టెలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి.
జొన్న రొట్టెను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
షుగర్ కంట్రోల్ అవుతుంది
జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
కండరాల పెరుగుదల
జొన్న రొట్టెలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల మరమ్మత్తుకు సహాయపడతాయి. అలాగే కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. బలంగా ఉండాలనుకునేవారు జొన్న రొట్టెను తింటే మంచిది.
గుండెకు మంచిది
జొన్నరొట్టెను తింటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రొట్టెను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుండె ఆరోగ్యానికి జొన్న రొట్టెను తినొచ్చు. అలాగే దీనిలో గ్లూటెన్ ఉండదు. కాబట్టి అలెర్జీ ఉన్నవారికి కూడా ఇది మంచిది.
బరువు తగ్గుతారు
బరువు తగ్గాలనుకునేవారికి జొన్న రొట్టె మంచి మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో కేలరీలు ఖర్చు అవుతాయి. దీంతో మీరు హెల్తీగా బరువు తగ్గుతారు.
జీర్ణక్రియకు మంచిది
జొన్నరొట్టెలు పేగుల ఆరోగ్యానికి కూడా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మీకు జీర్ణసమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.