రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?
కొంతమంది నీళ్లను మొత్తమే తాగరు. కానీ కొంతమంది మాత్రం నీళ్లను తాగుతూనే ఉంటారు. కొంతమంది రాత్రిపడుకునే ముందు బాగా నీళ్లను తాగి పడుకుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?
తాగునీరు మన శరీరానికి చాలా చాలా అవసరం. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా మన శరీరాన్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు నీళ్లను పుష్కలంగా తాగాలని చెప్తుంటారు. అయితే చాలా మంది రాత్రి నిద్రపోయే ముందు నీళ్లను బాగా తాగుతుంటారు. మరి ఇలా తాగితే ఏమౌతుందో తెలుసా?
మూత్రపిండాల ఆరోగ్యం
ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రపోవడానికి రెండు గంటల ముందు నీరు తాగడం సరైందిగా పరిగణించబడుతుంది. పడుకునే ముందు నీళ్లు తాగితే మూత్రపిండాలు వాటి పనిని సరిగ్గా చేస్తాయి. ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
సమస్యలు
నిద్రపోవడానికి ముందు నీళ్లను తాగితే మీరు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అపానవాయువు, సరిగ్గా నిద్రలేకపోవడం, తరచుగా మూత్రవిసర్జన జరగడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి మీకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి.
మూత్రపిండాలపై ప్రభావం
నిద్రపోయే ముందు నీళ్లను ఎక్కువగా తాగడం మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీకు ఇప్పటికే ఏదైనా కిడ్నీ సమస్య ఉంటే రాత్రి పడుకునే ముందు నీటిని తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
పగటిపూట నీళ్లు తాగితే?
మన శరీరానికి నీళ్లు ఎంతో అవసరం. ఎందుకంటే నీళ్లను తాగడం వల్ల మన శరీరంలోని మురికి, మలినాలు మొత్తం తొలగిపోతాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఉదయం, పగటిపూట పుష్కలంగా నీళ్లను తాగండి.
ఇలాంటి వారు జాగ్రత్త
మీకు గుండె లేదా మైగ్రేన్ కు సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రం రాత్రిపూట నీళ్లను ఎక్కువగా తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ నిద్ర చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఉన్న సమస్యలను మరింత ఎక్కువ చేస్తుంది.
సలహా
రాత్రిపూట మీకు ఎక్కువ దాహంగా అనిపిస్తే నెమ్మదిగా, తక్కువ నీళ్లను తాగండి. నిద్రవేళలో నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల అపానవాయువు (పిత్తులు) సమస్య వస్తుంది.
జాగ్రత్త
రాత్రిపూట నీరు నీళ్లను ఖచ్చితంగా తాగాల్సిన అవసరం లేదు. కానీ శరీరంలో నీళ్లు మొత్తమే లేకపోతే మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంి. అందుకే దాహం వేసినప్పుడు నీళ్లు తాగండి.