House Fly: తింటున్న ఆహారంలో ఈగ పడితే అపశకునమా? ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి?
శకున శాస్త్రం, వాస్తు శాస్త్రం.. రెండూ కూడా ఆహారంలో ఈగపడడం అశుభమేనని చెబుతున్నాయి. ఆహారంలో ఈగ పడడం వల్ల ఇంట్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరిస్తున్నాయ వాస్తు, శకున శాస్త్రాలు.

ఆహారంలో ఈగ పడితే
తినడానికి కూర్చున్నప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచో ఈగలు వచ్చేస్తాయి. ఏదో ఒక ఈగ ఆహారంలో పడుతుంది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవం అయ్యేదే. అయితే అందరికీ అన్నివేళలా జరగాలని లేదు. కొందరికి ఇలా జరుగుతుంది. తింటున్న ఆహారంలో ఈగపడడం అనేది శకున శాస్త్రం, వాస్తు శాస్త్ర ప్రకారం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదో తెలుసుకోండి.
ఈగ మంచిదే కానీ..
ఈగను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంటిలోని పూజ గదిలోకి ఈగలు రావడం మంచిదని అంటారు. ఇలా రావడం వల్ల ఇంటిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని చెబుతారు. కానీ అదేగా ఆహారంలో పడితే మాత్రం చెడు సంకేతాలను అందిస్తున్నట్టేనని అంటారు.
శకున శాస్త్రం ప్రకారం...
శకున శాస్త్రం ప్రకారం ఆహారంలో అస్మాత్తుగా ఈగ పడితే అది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతోందని సూచించడమే. అలాగే ఇంట్లోని వారికి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా అర్థం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈగలు ఇంట్లోకి ప్రవేశించడం అనేది ప్రతికూలమైన చర్య. ఇక ఇవి ఆహారంలో పడితే ఆ ఇంట్లోని వారి మధ్య తగాదాలు, గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
ఈగలతో డబ్బు నష్టం
ఈగ తింటున్న ఆహారంలో అకస్మాత్తుగా పడడం వల్ల అది ఇంట్లో ఏర్పడబోయే డబ్బు నష్టాన్ని సూచిస్తుందని అంటారు. అలాగే పనిలో అడ్డంకులు వస్తాయని కూడా అర్థం. ప్రతి పని ఆలస్యం కావడం వంటివి జరుగుతాయి. ఇక ఇంట్లో ఈగలు చనిపోతూ ఉంటే ఆ ఇంట్లో అశాంతి పెరుగుతుందని చెబుతారు.
చేతబడి చేసేవారట
పూర్వం ఈగలను చేతబడిలో ఉపయోగించే వారని అంటారు. ఒక ఈగ ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి మరణిస్తే ఏదో చేతబడి జరిగి ఉంటుందని అప్పట్లో అర్థం చేసుకునేవారు. కాబట్టి ఈగలు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దాదాపు ఈగలు ఎక్కువగా చేరకుండా చూసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈగల విషయంలో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.