MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Modi credit card: మోడీ క్రెడిట్ కార్డ్ వచ్చేస్తోంది, 5 లక్షల వరకు ముందే ఖర్చు పెట్టొచ్చు

Modi credit card: మోడీ క్రెడిట్ కార్డ్ వచ్చేస్తోంది, 5 లక్షల వరకు ముందే ఖర్చు పెట్టొచ్చు

నరేంద్ర మోడీ (Modi) ప్రభుత్వం క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టబోతోంది. ఈ క్రెడిట్ కార్డు పరిమితి ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంటే 5 లక్షల లోపు డబ్బును ముందే ఖర్చు పెట్టుకోవచ్చు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 15 2025, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోడీ క్రెడిట్ కార్డు
Image Credit : PTI

మోడీ క్రెడిట్ కార్డు

నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పథకాలను అమలులోకి తెస్తోంది. ఎన్నో పథకాలు చిన్న వ్యాపారాల కోసం రుణాలు ఇచ్చేందుకు కేటాయించారు. అలాగే మోడీ ప్రభుత్వం క్రెడిట్ కార్డులను కూడా ప్రవేశపెడుతోంది. బ్యాంకులు ఎలా అయితే ముందస్తు ఖర్చులకు క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే అవకాశాన్ని ఇస్తాయో.. అలాగే మోడీ ప్రభుత్వం కూడా క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని తీసుకురాబోతోంది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఎంతో మంది వ్యాపారులకు మేలు జరగబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎంతవరకు ఖర్చు పెట్టొచ్చు
Image Credit : Udaym portal

ఎంతవరకు ఖర్చు పెట్టొచ్చు

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సమర్పించారు. అలా బడ్జెట్ ను సమర్పిస్తున్నప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు పరిమితి కలిగిన క్రెడిట్ కార్డులను ప్రవేశపెడతామని ఆమె చెప్పారు. Udyam పోర్టల్ లో నమోదు చేసుకున్న వారికి ఈ క్రెడిట్ కార్డులు అందజేస్తామని ఆమె చెప్పారు. మొదటి ఏడాదిలో పది లక్షల కార్డులు జారీ చేస్తామని వివరించారు.

35
ఎవరికి ఇస్తారు?
Image Credit : Pixabay

ఎవరికి ఇస్తారు?

భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ క్రెడిట్ కార్డులను మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల సాయంతో వ్యాపారం మొదలుపెట్టిన వారికి ఈ రుణాలను అందించే క్రెడిట్ కార్డులను అందజేస్తారు. అంటే సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థలకు లేదా మధ్యతరహా పరిశ్రమలకు ఈ క్రెడిట్ కార్డులు అందజేస్తారు.

45
వ్యాపారులకు లాభం
Image Credit : Pixabay

వ్యాపారులకు లాభం

ఈ క్రెడిట్ కార్డులు వ్యాపారులకు ఎంతో మేలు చేస్తాయి. పరికరాలు, వస్తువులను కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బులు లేకపోయినా ఈ క్రెడిట్ కార్డు సాయంతో కొనవచ్చు. అలా వ్యాపార ఖర్చులను తీర్చుకున్నాక వచ్చిన లాభంతో తిరిగి ప్రభుత్వానికి చెల్లించవచ్చు. ఈ కార్డులు వ్యాపార ఖర్చులను ట్రాక్ చేయడానికి కూడా సహాయపడతాయి. తద్వారా ఖర్చులను నియంత్రిస్తాయి.

55
ఎన్నో ఆఫర్లు
Image Credit : Pixabay

ఎన్నో ఆఫర్లు

ఈ క్రెడిట్ కార్డులు బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్ కార్డుల మాదిరిగానే రివార్డులను, క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అలాగే ఈ కార్డుతో టర్మ్ లోన్లు తీసుకోవచ్చు. తిరిగి చెల్లించడం వల్ల వారికి ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయి. ఈ క్రెడిట్ కార్డును వాడిన తర్వాత.. చెల్లింపులు సకాలంలో చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ బలంగా మారుతుంది. ఈ క్రెడిట్ కార్డులు ద్వారా డబ్బును వాడిన తర్వాత తిరిగి చెల్లించేందుకు 45 నుండి 50 రోజుల వరకు వడ్డీ లేకుండానే కాలపరిమితిని అందిస్తుంది. వ్యాపారాలకు స్వల్ప కాలంలో వర్కింగ్ క్యాపిటల్ అందించడానికి ఈ క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు. తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ సేవలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ క్రెడిట్ కార్డుల కోసం SBI, HDFC, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్ ఇలా కొన్ని బ్యాంకులతో అనుసంధానమయ్యింది కేంద్ర ప్రభుత్వం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Modi Gold: ఇదిగో మోడీ గోల్డ్ .. తులం బంగారం ధర 37 వేల రూపాయలే
Recommended image2
Gold at Home: ప్రభుత్వ నియమాల ప్రకారం మీ ఇంట్లో ఎంత బంగారం ఉండవచ్చు? అంతకుమించి ఉంటే ఏంజరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved