30 ఏండ్లు దాటిన వారికి మాత్రమే..
మూడు పదుల వయస్సు ఒక మైల్ స్టోన్ లాంటిది. ఈ వయసులో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తించినా.. మీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులోనూ ఈ కాలం ఎవరికోసం ఆగదు కూడా..

కాలం మన కోసం ఆగదన్న సంగతి మనందరికి గుర్తే.. కానీ చాలా మంది తాము చేయాల్సిన పనులను ఇప్పుడు కాదు రేపు.. రేపు కాదు ఎల్లుండి అంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతారు. కానీ మీ జీవితం మీకోసం కాదుకదా.. మరెవరికోసమూ ఆగదు. జెట్ స్పూడ్ లోనే దూసుకెళిపోతూనే ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో మీరు ఏ మాత్రం కేర్ లెస్ గా ఉన్నా.. మీ మూడు పదుల జీవితం ముగిసినట్టే. ఈ వయసులో కొన్ని పనులను తప్పక చేయాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పదండి..
ఆరోగ్యం ముఖ్యం: మీ ఆరోగ్యాన్ని బాగుచేయడానికి మీకున్న సమయం, సందర్భం ఏదైనా ఉందా అంటే అది ఈ మూడు పదుల వయసనే చెప్పాలి. ఈ వయస్సు మించిపోతే మీరు ఆరోగ్యంగా మారుతారనేది కేవలం మీ కల మాత్రమే. కాబట్టి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఉండండి. పోషకాలు, ఖనిజలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటూ ఉండండి.
ఆర్థికంగా: మీకు 30 ఏండ్లు నిండేసరికి మీరు ఆర్థికంగా స్థిరపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ వయసు నుంచే మీ బాధ్యలు మరిన్ని పెరుగుతుంటాయి. ఇప్పటి నుంచి మీ సంపాదనలో మూడో భాగం పోగేయడం స్టార్ట్ చేయండి. అప్పుడే అవసరాలను తొందరగా తీర్చుకోగలుగుతారు.
భరోసాగా: అప్పులు లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. అలాగే అప్పులు ఉంటే మొత్తం తీర్చేయండి. అలాగే భూమి, బంగారం వంటివి కొనుగోలు చేయండి. భవిష్యత్ లో ఇవి వేటికైనా ఉపయోగపడొచ్చు.
మీ కోసం.. మీకోసం కాస్త సమయాన్ని వెచ్చించండి. మీరు చెయ్యాలనుకున్న సమయం లేక చేయలేకపోయిన వాటన్నింటినీ చేసేయండి. ఒక్కొక్కటిగా మీ కోరికలను తీర్చేసుకోండి. బంధువులు, స్నేహితులతో గడపటానికి కాస్త సమయాన్ని కేటాయించండి.
వదిలేసే టైం ఇదే.. తర్వలో మానేయాలి అనుకుంటూ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న చెడు అలవాట్లను ఇప్పటికైనా మానుకోండి. లేదంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ట్రావెల్ చేయాలనుకుంటే.. మీరు ఇంతవరకు చూడని.. చూడాలనుకున్నవి ఇప్పుడే చూసేయండి. ముందు ముందు మీకు డబ్బులు అందుబాటులో ఉండొచ్చు కానీ సమయం మాత్రం ఉండదు. కాబట్టి ముప్పైలోనే ట్రావెల్ చేస్తూ ఉండండి.
డెసిషన్స్ కు.. డిసిషన్స్ తీసుకోవడానికి ఈ వయస్సే కీలకం. సంతానం, పిల్లల ఫ్యూచర్ ప్లానింగ్స్ , ఇల్లు కొనడం వంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం.