Dreams in sleeping: కలలో ఇలాంటివి కనిపిస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
Dreams in sleeping: కొన్ని రకాల కలలు మన ఫ్యూచర్ ను తెలియజేస్తాయని కొంతమంది నమ్ముతుంటారు. అందులో తెల్లవారు జామున వచ్చే డ్రీమ్స్ పక్కాగా జరుగుతాయని విశ్వసిస్తారు. అయితే మన కలలో జరిగే కొన్ని అంశాలు అవి మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని కొంతమంది నమ్ముతున్నారు.

Dreams in sleeping: మనం ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తామో వాటికి సంబంధించినవే మనకు కలలుగా వస్తాయని కొంతమంది బలంగా నమ్ముతారు. మరికొంతమందైతే కలలో పడ్డవి మన నిజజీవితంలో జరుగుతాయనీ.. వాటిని తేలిగ్గా తీసుకోకూడదని చెబుతుంటారు. అయితే కలలో జరిగిన కొన్ని ఘటనలు మనకు చెడు జరిగే అవకాశముందని తెలిపే సూచికలట. అంతేకాదు అలాంటి కలలు అశుభం అని పెద్దలు అంటుంటారు. అంతేకాదు మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంతో పాటుగా అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని కొందరు నమ్ముతున్నారు. మరి ఎలాంటి కలలు పడితే అశుభం జరుగుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
మీ కలలో మీరు ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి దూకడం లాంటివి పడితే .. మీకు పెద్ద నష్టం రాబోతోందనే ముందస్తు సూచిక అని అర్థమట. ఎలాగంటే.. వ్యాపార పరంగా ఆర్థికంగా నష్టాలపాలవడం వంటివి జరగొచ్చు. ఇలాంటి కలలు పడినప్పుడు మీ ఇష్టదైవాన్ని పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుందని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీ ఇంటికి తాళం వేసినట్టు కల పడితే కూడా అది మనకు మంచిది కాదు. ఇలా కలలు వస్తే వృత్తి పరంగా మీకు చెడు జరగబోతోందని అర్థం. అందుకే ఇంటికి తాళం వేసినట్టు కలలు వస్తే ఆంజనేయ స్వామిని పూజించండి. దీని వల్ల మీకు ఎటువంటి చేటు జరగదని కొంత మంది జోతిష్యులు చెబుతున్నారు.
పసుపు వస్త్రాలపై మరకలు పడ్డట్టు కలలు వస్తే అది డబ్బు నష్టం జరుగుతుంది అనడానికి సంకేతమట. ఇలాంటి కలలు పడ్డప్పుడు లక్ష్మీదేవిని పూజించి ఎర్రని వస్త్రాలు సమర్పించాలని చెబుతున్నారు. ఎందుకంటే ఎర్రటి వస్త్రాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమెను ప్రసన్నం చేసుకోవడమే కాదు.. ఆమె దయ ఎప్పుడూ వారిపై ఉంటుందట.
ఎటైనా వెళుతుంటే పిల్లలు అడ్డు వస్తే మంచిది కాదని చాలా మంది అనుకోవడం మనకు తెలిసిందే. అందులో నల్ల పిల్లి అడ్డు రావడం వల్ల అశుభం జరుగుతుందని నమ్ముతుంటారు. అయితే కలలో నల్ల పిల్లి కనిపించినట్టు వస్తే ఫ్యూచర్ లో మీకు అశుభం జరగబోతోందని సంకేతమట. అలాంటి కలలు వస్తే శివుడిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందట.
కలలో చాలా మందికి అప్పుడప్పుడు జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలో జంతువులు కనిపిస్తే మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందట. ఇలాంటి కలలు పడ్డప్పుుడు పేదవారికి ఆహారం లేదా బట్టలు దానం చేస్తే దాని నుంచి నివృత్తి కలుగుతుందని కొందరు జ్యోతిష్యులు నమ్ముతున్నారు. ..