Bay Leaf: బిర్యానీ ఆకుతో ఇలా చేశారంటే దోమలు పరార్.. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ కూడా మాయం!
Bay Leaf: ఇంట్లోకి దోమలు, చిన్న చిన్న ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా? వీటిని తరిమికొట్టేందుకు ఖరీదైన కాయిల్స్, లిక్విడ్స్ వాడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో ఉండే రెండు చిన్న వస్తువులు చాలు.
బిర్యానీ ఆకుతో ఎన్నోలాభాలు
ప్రతి ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి. వాటిని కేవలం వండడానికే కాదు. రోజువారీ కొన్ని సమస్యలు తీర్చడానికి కూడా వాడవచ్చు. రోజూ సాయంత్రం కాగానే ఇంట్లో దోమల బెడద మొదలవుతుంది. దోమల బిళ్లలు, కెమికల్ లిక్విడ్స్ వాడినా లాభం ఉండదు. పైగా ఆ పొగతో ఆరోగ్యానికి కూడా నష్టం. అయితే, మీ వంటగదిలో ఉండే 'బిర్యానీ ఆకు' , 'పసుపు' వాడి ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు. ఇది దోమలను తరిమికొట్టడమే కాదు, ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది.
ఎలా చేయాలి?
దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పసుపు తీసుకుని, అందులో రెండు చుక్కల నీళ్లు వేసి చిక్కటి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ పేస్ట్ పలచగా కాకుండా గట్టిగా ఉండాలి. ఆ తర్వాత ఈ పసుపు పేస్ట్‌ను బిర్యానీ ఆకుకు (Bay leaf) పూర్తిగా పూయాలి. పసుపు రాసిన ఈ ఆకును ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆకు పూర్తిగా ఎండిన తర్వాత, సాయంత్రం పూట ఇంట్లో దాన్ని కాల్చాలి.
దీని వల్ల లాభాలు ఏంటి?
బిర్యానీ ఆకు, పసుపు కాల్చినప్పుడు వచ్చే పొగను ఇంట్లోని మూలమూలలా వ్యాపించేలా చేయాలి. ఈ న్యాచురల్ పొగ వాసనకు ఇంట్లోని చిన్న ఈగలు, దోమలు వెంటనే పారిపోతాయి.
అంతేకాదు, ప్రాచీన కాలం నుంచి పసుపును స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. బిర్యానీ ఆకు సువాసన, పసుపు పొగ గాలిని శుద్ధి చేస్తాయి. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలి, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తాయి.
ఖర్చు లేని, కెమికల్స్ లేని ఈ న్యాచురల్ చిట్కాను మీరూ ట్రై చేసి చూడండి.








