Sleeping Disorder: జస్ట్ ఈ టిప్స్ చాలు మీరు హాయిగా నిద్రపోవడానికి..
Sleeping Disorder:ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కంటి నిండా నిద్రపోవడం సవాలుతో కూడుకున్నది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాత్రంతా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఉదయం చికాకు, తలనొప్పి, కోపం, అలసట వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్స్ ను పాటిస్తే ఈజీగా నిద్రలోకి జారుకుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us

Sleeping Disorder: నేటి గజిబీజీ లైఫ్, బిజీ షెడ్యూల్ తో చాలా మంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తద్వారా వారు బంగారం లాంటి నిద్రకు దూరమవ్వాల్సి వస్తోంది. దీంతో వారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తోంది. రాత్రి సమయంలో నిద్రపోవాలని వీరు ఎంతో ప్రయత్నిస్తారు. అయినా నిద్రపట్టదు. దీనికంతటికి ప్రధాన కారణం మారుతున్న మన జీవన శైలీ, ఒత్తిడి, బిజీ షెడ్యూల్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కారణాలేవైనా.. నిద్రపోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. రాత్రంతా నిద్రలేకపోవడంతో ఉదయం ఫ్రెష్ గా ఉండలేరు.
కంటినిండా నిద్రలేకపోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత అలసట, కోపం, చికాకు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నిద్రలేమి సమస్యను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి మనిషికీ నిద్ర ఎంతో అవసరం. నిద్రతోనే మనిషి యాక్టీవ్ గా ఉండగలుగుతాడు. కాబట్టి మీరు రాత్రి పూట ఎక్కువ సమయం నిద్రపోండి. ఒకవేళ మీరు రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోతే.. 8 గంటలకు బదులుగా రోజుకు 10 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. దీనివల్ల మీకు సరిపడా నిద్ర అందుతుంది. దాంతో మీరు రీఫ్రెష్ గా ఉండగలుగుతారు.
కాఫీ, సిగరేట్ అలవాటుంటే వెంటనే మానుకోండి. వీటివల్ల కూడా మీరు నిద్రకు దూరమవుతారు. ప్రతి రోజు సాయంత్రం లేదా రాత్రిపూట కాఫీ తాగే అలవాటుంటే వెంటనే మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది నిద్రను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పలు అధ్యయనాల ప్రకారం.. టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్న వారు రాత్రుళ్లు నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతున్నట్టు తేలింది. వీటితో పాటుగా సిగరేట్ తాగే వారు కూడా నిద్రపోవడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారట.
చాలా మంది పగటిపూట ఎక్కువగా నిద్రపోతుంటారు. కానీ ఇలా పగటిపూట నిద్రపోవడం వల్ల రాత్రుళ్లు తొందరగా నిద్రపోలేరని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ప్రతిరోజూ పగటి పూట ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆ అలవాటును మానుకుంటే మంచిది.
వ్యాయామాలతో ఫిట్ గా ఉండటమే కాదు రాత్రి వేళల్లో హాయిగా కూడా నిద్రపోవచ్చు. అందుకే ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో తేలికపాటి వ్యాయామాలను చేయడం అలవాటు చేసుకోండి. వ్యాయామాలు చేయడం వల్ల శరీరం అలసిపోతుంది. తద్వారా నిద్ర తొందరగా పడుతుంది.
చాలా మందికి రాత్రిపూట లేట్ గా తినే అలవాటు ఉంటుంది. అంతేకాదు డిన్నర్ లో హెవీ ఫుడ్ ను తీసుకునే వారు కూడా ఎక్కువే ఉన్నారు. ఇది అంత మంచి పద్దతి కాదు. ఎందుకంటే హెవీ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కడుపు పెరుగుతుంది. అలాగే ఎసిడిటీ లేదా గ్యాస్ వంటి సమస్యలు అటాక్ చేసే ప్రమాదం ఉంది. తద్వారా రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టదు.