పళ్లు తెల్లగా కావాలంటే ఏం చేయాలి?
చాలా మంది దంతాలు ఎంత తోమినా పసుపు రంగులోనే కనిపిస్తాయి. దీనికి కారణాలు ఎన్నో. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి.
white teeth
ప్రతి ఒక్కరూ తమ దంతాలు శుభ్రంగా తెల్లగా, తలతల మెరవాలని కోరుకుంటారు. కానీ రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినా కూడా పసుపు రంగులోనే కనిస్తాయి. దీనికి దీనికి అసలు కారణం పోషకాహార లోపమంటున్నారు నిపుణులు. చిగుళ్లలో సంక్రమణ వల్ల కలిగే చిగురువాపు వల్ల కూడా కొన్నిసార్లు దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి.
teeth
కాల్షియం లోపం లేదా కాలేయంలో సమస్యల వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటుగా స్మోకింగ్, కూల్ డ్రింక్స్, పొగాకు, సోడా, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. వీటిలో ఉండే రసాయనాలు మన దంతాల ఎనామిల్ ను దెబ్బతీసి సహజ ప్రకాశాన్ని కోల్పోయేలా చేస్తాయి.
అందుకే మనం ఎన్ని టూత్ పేస్ట్ లను వాడినా దంతాలు మాత్రం తెల్లగా కావు. అయితే కొన్నిఇంటి చిట్కాలతో కూడా దంతాలను తెల్లగా తలతల మెరిసేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మ, ఉప్పు, బేకింగ్ సోడా
ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా పౌడర్ లో ఒక టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఉప్పు మిక్స్ చేయండి. దీన్ని టూత్ బ్రష్ తో దంతాలను కాసేపు తోమండి. కాసేపు అలాగే వదిలేయండి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. బేకింగ్ సోడా, నిమ్మకాయ పళ్లను శుభ్రం చేయడానికి సహాయపడతాయి. అలాగే ఉప్పు వాటిని పోషించడానికి పనిచేస్తుంది.
కొబ్బరి నూనె మసాజ్
కొబ్బరినూనెతో దంతాలకు మసాజ్ చేస్తే కూడా దంతాలు తెల్లగా మారుతాయి. ఇందుకోసం దంతాలకు కొబ్బరి నూనె పెట్టి కాసేపు అలాగే ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ ఆమ్లం దంతాలలో ఫలకం కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి.
ఆరెంజ్ తొక్క
ఆరెంజ్ తొక్కను ఎండలో ఎండబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ లా తయారుచేయండి. దీనికి కొన్ని నీళ్లను కలిపి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు బ్రష్ తో దంతాలను తోమండి. ఇలా రోజూ చేయడం వల్ల దంతాల తెల్లగా మారుతాయి.
ఎగ్ షెల్
ఎగ్ షెల్ ను గ్రైండ్ చేసి పౌడర్ లా తయారుచేసుకుని దీంతో దంతాలను తోముకుంటే కూడా దంతాలు తెల్లగా మెరుస్తాయి. ఆ తర్వాత ఏదైనా తెల్లటి పేస్ట్ తో బ్రష్ చేసుకోవాలి.
క్రంచీ పండ్లు, ఆహారాలు తినండి
క్రంచీ పండ్లు, ఏదైనా ఫుడ్ ను నమలడం వల్ల పంటి ఫలకం త్వరగా తొలగిపోతుంది. అలాగే దంతాలకు పోషకాహారం కూడా అందుతుంది. అలాగే దంతాలు తెల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే మిమ్మల్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోండి. అలాగే మౌత్ వాష్ ను వాడండి.