Beauty Tips: కాంతివంతమైన ముఖం కోసం.. టమోటాలను ఈ విధంగా ఉపయోగించండి!
Beauty Tips: టమోటాలను కూరలకే కాదు సౌందర్య సాధనంగా కూడా వాడుకోవచ్చు. టమోటాలు చర్మాన్ని మెరిసేలా చేయడంలో తోడ్పడుతుంది. ఈ టమోటాలతో చేసే పలు రకాల ఫేస్ మాస్కుల గురించి ఇప్పుడు చూద్దాం.
టమోటాలను ఆహారం గానే కాదు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. టమోటాలు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. స్కిన్ టోన్ ని మెరుగుపరచడంలో, మచ్చలను తొలగించి కాంతివంతంగా మార్చడంలో టమోటాలు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపల నుంచి రిపేర్ చేయడానికి పనిచేస్తాయి. టమోటా లో ఉండే బ్లీచింగ్ గుణాలు ఒంటి రంగుని మెరుగు పరుస్తాయి. తేనే చర్మం లో నివారింపుని పెంచుతుంది.
అందుకే టమాటాని సగానికి కట్ చేసి దానిపై కొద్దిగా తేనె పోయండి. ఆపై టమాటా ముక్కని రంగు మారిన చర్మంపై నాలుగైదు నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన ముఖం కాంతివంతంగా తయారవ్వటమే కాకుండా పిగ్మెంటేషన్ కూడా తొలగిపోతుంది.
అలాగే టమాటాలను ముందుగా గ్రైండ్ చేసి అందులో కొంచెం పంచదార కలపండి. ఈ స్క్రబ్ ని ముఖంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. ఆరిన తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా చేయడం వలన చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి.
ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే టానింగ్ సమస్య ఉన్నప్పుడు టమాటా రసంలో నిమ్మరసం కలిపి చర్మానికి అప్లై చేయండి. టమాటాలు సహజమైన బ్లీచింగ్ గుణాలని కలిగి ఉంటాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మపురంగుని మెరుగుపరుస్తుంది.
ఒక టమోటా పండు రసంలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వండి. అనంతరం రోజువాటర్ స్ప్రే చేసి చేతులతో తేలికగా మర్దన చేసి ఒక పావు గంట తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోండి. ఇలా చేయటం వలన టానింగ్ సమస్య తీరిపోతుంది.