ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు..
బల్లులు ఇండ్ల నుంచి పోవడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారు చాలా మందే ఉంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో బల్లులను ఈజీగా వదిలించుకోవచ్చు. అదెలాగంటే..

బల్లులు లేని ఇండ్లు దాదాపుగా ఉండవేమో. ప్రతి ఇంట్లో గోడల మూలలకు ఇవి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ వేసవిలో బల్లులు ఇండ్లలోకి ఎక్కువగా వస్తాయి. కానీ ఈ బల్లులు అంటే పిల్లలతో పాటుగా పెద్దలు కూడా బయటపడుతుంటారు. ఇక వీటిని వెల్లగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయినా అవి అంత సులువుగా ఇండ్లను వదిలిపోవు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో బల్లులను చంపకుండా ఇంట్లోంచి వెల్లగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గుడ్డు తొక్కలు.. బల్లులను తరిమికొట్టడానికి మీరు ఎగ్ షెల్స్ (Egg shells) ఉపయోగించవచ్చు. దీని కోసం ఖాళీ గుడ్డు తొక్కను తీసుకుని బల్లులు ఎక్కువగా తిరిగే ప్లేస్ లో పెట్టండి. దీనివల్ల ఆ దరిదాపులోకి కూడా బల్లి రావడానికి సాహసం చేయదు. ఎందుకంటే ఎగ్ షెల్స్ వాసన బల్లికి నచ్చదు. మళ్లీ బల్లి ఆ ప్రదేశానికి తిరిగి రానే రాదు.
ఉల్లిపాయ, వెల్లుల్లి.. ఉల్లిపాయలు, వెల్లుల్లి వాసన కూడా బల్లులను పారిపోయేలా చేస్తుంది. వీటి నుంచి వచ్చే ఘాటు వాసన బల్లికి చికాకును కలిగిస్తుంది. ఒక్కసారి వీటిని వాసన చూస్తే బల్లి మళ్లీ ఆ ప్రదేశానికి రానేరాదు. ఇందుకోసం తరిగిన ఉల్లిపాయ లేదా వెల్లుల్లి మొగ్గను బల్లులు తిరిగే ఏ ప్రదేశంలో నైనా వేలాడదీయండి. దీని ఘాటైన వాసన బల్లులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
పెప్పర్ స్ప్రే.. నల్ల మిరియాల పొడి (Black pepper powder)ని తయారు చేసి.. దానిని నీటిలో కలపండి. ఈ ద్రావణాన్ని ఒక స్ప్రే బాటిల్ లో వేసి బల్లలు సాధారణంగా తిరిగే ప్రదేశంలో చల్లండి. ఇలా చేయడం వల్ల బల్లి ఆ ప్రదేశానికి రాదు. అంతేకాదు అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది కూడా.
నెమలి ఈకలు.. బల్లులను తరిమికొట్టడానికి నెమలి ఈకలు బాగా ఉపయోగపడతాయి. వాస్తవానికి నెమళ్లు బల్లులను తింటాయి. అందుకే నెమలి ఈక యొక్క స్మెల్ట్ లేదా దానిని చూడటం వల్ల బల్లులు పారిపోతాయి. నెమలి ఈక ఉన్న ప్లేస్ కు బల్లులు అస్సలు రావు. అందుకే నెమలి ఈకలను మీ ఇంట్లో పెట్టండి. నెమలి ఈకలు మీ ఇంటికి మంచి ఆకర్షణగా కూడా ఉంటాయి. దీని వల్ల బల్లులు కూడా దూరంగా ఉంటాయి.
నాఫ్తలీన్ బంతులు.. కొన్ని నాఫ్తలీన్ బంతులను మీ ఇంటి చుట్టూ పెట్టండి. అలాగే ప్రతి డ్రాయర్, వార్డ్ రోబ్ లేదా మూలలో ఉంచండి. బల్లులు ఈ నాఫ్తలీన్ బంతుల ఘాటైన వాసనను చిరాకు కలిగిస్తాయి. దీంతో అవి ఆ ప్రదేశానికి దూరంగా ఉంటాయి.
కాఫీ మరియు పొగాకు మిశ్రమంతో తయారు చేసిన బంతులు.. కాఫీ బల్లులను వదిలించుకోవడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు ఈ బంతులను ఇంటి ప్రతి మూలలో ఉంచవచ్చు. దీంతో బల్లులు మీ ఇంటి నుంచి పారిపోతాయి.