MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Switch Board Cleaning: మీ ఇంట్లో స్విచ్ బోర్డ్స్ మురికిగా మారాయా? దీనితో తుడితే కొత్త వాటిలా కనిపిస్తాయి

Switch Board Cleaning: మీ ఇంట్లో స్విచ్ బోర్డ్స్ మురికిగా మారాయా? దీనితో తుడితే కొత్త వాటిలా కనిపిస్తాయి

Switch Board Cleaning: ఇంట్లో మనం రెగ్యులర్ గా వాడే వాటిలో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి. తరచూ తాకడం వల్ల అవి మురికిగా మారిపోతాయి. ఆ పేరుకుపోయిన మురికిని వదిలించడం కష్టంగా ఉందా? సింపుల్ చిట్కాలతో కొత్త వాటిలా మెరిపించొచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 27 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
switch board cleaning..
Image Credit : Chat GPT

switch board cleaning..

దీపావళి పండగ వచ్చేస్తోంది. పండగ వస్తోంది అంటే చాలు.. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఇంటి అన్ని మూలలూ శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఇంట్లోని ప్రతిమూలా శుభ్రం చేసినా కూడా... ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోని విషయం ఒకటి ఉంది, అదే స్విచ్ బోర్డులు. ప్రతిరోజూ మనం నిరంతరం వాడటం, చేతి ముద్రలు పడటం, దుమ్ముచేరడం వల్ల తెల్లటి స్విచ్ బోర్డులు క్రమం తప్పకుండా పసుపు రంగులోకి మారి అసహ్యంగా తయారౌతాయి. ఇది ఎంత అందమైన గోడల అందాన్ని అయినా పాడుచేస్తుంది. అయితే కంగారు పడకండి. ఈ దీపావళికి మీ ఇంటి స్విచ్ బోర్డులను సురక్షితంగా, సులభంగా శుభ్రం చేసి కొత్తదానిలా మెరిసిపోయేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పొడి మైక్రోఫైబర్ వస్త్రంతో స్టార్ట్ చేయండి
Image Credit : SP Creation's Manu YT

పొడి మైక్రోఫైబర్ వస్త్రంతో స్టార్ట్ చేయండి

స్విచ్‌బోర్డ్‌పై ఉన్న పైపైన దుమ్మును తొలగించడానికి మొదట ఒక పొడి మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించండి. ఇది ఉపరితలంపై ఉన్న దుమ్ము , తేలికపాటి మురికిని సులభంగా పీల్చుకుంటుంది. స్విచ్‌బోర్డ్ అంచుల చుట్టూ వస్త్రాన్ని సున్నితంగా తుడవండి. శుభ్రం చేయడానికి ముందు సంబంధిత సర్క్యూట్ ని తప్పనిసరిగా ఆఫ్ చేసుకోవాలి. స్విచ్‌బోర్డ్ పూర్తిగా పొడిగా ఉందో లేదో నిర్ధారించుకున్నాకే పని ప్రారంభించండి.

2. గ్రీజు, మురికి వదిలించడానికి ..

స్విచ్‌బోర్డ్ బయటి ప్లాస్టిక్ ఉపరితలంపై జిడ్డు లేదా నల్లటి చేతిముద్రలు ఉన్నట్లయితే, తేలికపాటి సబ్బు ద్రావణం బాగా పనిచేస్తుంది. ఒక మెత్తటి క్లాత్ ని సబ్బు నీటిలో ముంచి, బాగా పిండివేయాలి. తర్వాత ఆ స్విచ్ బోర్డుపై తుడవాలి. ఆ క్లాత్ పై ఒక్క నీటి చుక్క కూడా కారకుండా చూసుకోండి. రంధ్రాలు, స్విచ్‌లు లేదా సాకెట్ల లోపలికి తేమ వెళ్లకుండా అత్యంత జాగ్రత్త వహించండి.

33
3. బేకింగ్ సోడాను డైరెక్ట్‌గా పూయవద్దు..
Image Credit : Getty

3. బేకింగ్ సోడాను డైరెక్ట్‌గా పూయవద్దు..

సాధారణంగా ఇల్లు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడతారు, కానీ స్విచ్‌బోర్డ్‌లకు దాని పేస్ట్‌ను నేరుగా పూయడం అసలు మంచిది కాదు. దీనివల్ల ప్లాస్టిక్ ఉపరితలంపై గీతలు పడటమే కాకుండా, తేమ లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా పొడి క్లాత్ లేదా సబ్బు నీటితోనే ప్రయత్నించండి. మొండి మరకలు ఉంటే తయారీదారు సిఫార్సు చేసిన ప్రత్యేక క్లీనర్‌ను మాత్రమే వాడండి.

4.పసుపు రంగులోకి మారితే..

స్విచ్‌బోర్డ్ పసుపు రంగులోకి మారడానికి కేవలం మురికి మాత్రమే కారణం కాకపోవచ్చు. ప్లాస్టిక్ పాతబడటం, లోపలి వేడి లేదా సూర్యరశ్మి పడటం వల్ల కూడా ప్లాస్టిక్ రంగు మారుతుంది. ఇటువంటి సందర్భాల్లో సాధారణ శుభ్రత వల్ల అది మళ్లీ తెల్లగా మారకపోవచ్చు. దానికోసం కఠినమైన రసాయనాలు, బ్లీచ్ లేదా గట్టిగా రుద్దే స్క్రబ్బర్‌లను అస్సలు ఉపయోగించవద్దు. కలర్ పూర్తిగా మారిపోతే పాత స్విచ్‌బోర్డ్ ప్లేట్‌ను కొత్త దానితో మార్చడమే సరైన పరిష్కారం.

స్విచ్ బోర్డు కొత్తగా కనిపించాలంటే ఏం చేయాలి...

ప్రతి వారం పొడి క్లాత్ తో పైన ఉన్న దుమ్మును దులపడం వల్ల మురికి పేరుకుపోకుండా ఉంటుంది. స్విచ్‌బోర్డ్‌పై నేరుగా నీటిని లేదా క్లీనర్ లిక్విడ్‌ను ఎప్పుడూ స్ప్రే చేయకూడదు. పవర్ ఆన్‌లో ఉన్నప్పుడు తడి గుడ్డను అసలు తాకించవద్దు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Morning Bath Vs Night Bath: చర్మం బాగుండాలంటే స్నానం ఉదయం చేయాలా? రాత్రి చేయాలా?
Recommended image2
Glass Bangles: చీరల మీదకు సెట్ అయ్యే గ్లాస్ బ్యాంగిల్స్ డిజైన్లు
Recommended image3
Kulcha Capital: మనదేశంలో ‘కుల్చా క్యాపిటల్‌’గా పేరొందిన నగరమేదో తెలుసా? వరల్డ్ వైడ్ ఫేమస్ ఇది
Related Stories
Recommended image1
Chef Hat: రెస్టారెంట్స్ లో పనిచేసే చెఫ్స్... తలకు తెల్లటి టోపీనే ఎందుకు పెట్టుకుంటారు..?
Recommended image2
Rent a Country: మీ దగ్గర రూ.58లక్షలు ఉంటే, ఏకంగా దేశాన్ని అద్దెకు తీసుకోవచ్చు,ప్రపంచంలోనే వింత దేశం ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved