MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గోడలకున్న పెన్ను, పెన్సిల్ గీతలు, మరకలు పోవాలంటే ఇలా చేయండి

గోడలకున్న పెన్ను, పెన్సిల్ గీతలు, మరకలు పోవాలంటే ఇలా చేయండి

ఇంట్లో చిన్న పిల్లలుంటే పక్కాగా.. గోడలకు రకరకాల పెన్ను గీతలు, పెన్సిల్ గీతలు, రంగులు, బురద మరకలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇవి మాత్రం పోవు. అయితే మీరు కొన్ని ఈజీ పద్దతిలో ఈ మరకలను పోగొట్టొచ్చు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 07 2024, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బుడి బుడి అడుగులు వేసే పిల్లల నుంచి స్కూలుకు వెళ్లే పిల్లల వరకు ప్రతి ఒక్కరూ.. ఏబీసీడీలు రాయడానికైనా, బొమ్మలను గీయడానికైనా గోడలనే ఉపయోగిస్తుంటారు. అందుకే చిన్న పిల్లలున్న ఇంటి గోడలు కలర్ కలర్ పెన్నులు, పెన్సిల్, స్కెచ్ మరకలతో నిండి పోయి ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని సార్లు బురద మరకలు, కాళ్లకున్న దుమ్ము మరకలు కూడా గోడలపై అచ్చులు పడుతుంటాయి. వీటివల్ల గోడలు మురికిగా మారుతాయి. 

కానీ పెన్ను, పెన్సిల్, పెయింటింగ్ గీతలు గోడలకు అస్సలు పోవు. ఆడవాళ్లు వీటిని పోగొట్టడానికి ఎంతో కష్టపడతారు. దీనివల్ల వాల్ పెయింట్ పోవడమే కానీ.. పిల్లలు పెట్టిన గీతలు మాత్రం అస్సలు పోవు.

ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని పద్దతుల్లో మాత్రం గోడలకున్న పెన్ను, పెన్సిల్, పెయింటింగ్ తో పాటుగా ఇతర మరకలను కూడా చాలా సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24


వెనిగర్ 

చాలా సార్లు పిల్లలు ఆడుకునేటప్పుడు, ఏదేనా రాసేటప్పుడు గోడలపై పెన్ను, పెన్సిల్ గీతలను పెడుతుంటారు. అలాగే రంగులను కూడా పూస్తుంటారు. కానీ ఇది తెల్లని గోడల అందాన్ని పాడు చేస్తుంది. అయితే మీరు వెనిగర్ ను ఉపయోగించి ఈ మరకలను, గీతలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. వెనిగర్ ఒక నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇది మరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

ఇందుకోసం నీళ్లలో కొంచెం వెనిగర్ ను కలిపి దీన్ని స్ప్రే బాటిల్ లో పోయండి. దీన్ని గోడలకు ఎక్కడెక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ స్ప్రే చేయండి.  కొన్ని నిమిషాలు అలాగే ఉంచి మెత్తని గుడ్డ లేదా స్క్రబ్ తో సున్నితంగా రుద్దితే గోడకు ఒక్క మరక లేకుండా పోతుంది. 

34

బేకింగ్ సోడా

గోడకు అంటిన మరకలను పోగొట్టడానికి మీరు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించొచ్చు. నిజానికి బేకింగ్ సోడా గోడకు అంటిన మరకలను చాలా ఈజీగా పోగోట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లలో కలిపి పేస్ట్ లా చేయండి.

ఈ పేస్ట్ ను గోడలకు ఉన్న మరకలపై, గీతలపై అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఒక తడి గుడ్డతో సున్నితంగా రుద్దండి. గోడలకు పిల్లలు పూసిన పెయింట్ ను, పెన్ను, పెన్సిల్ మరకలను పోగొట్టడానికి ఈ పేస్ట్ ను డిష్ వాష్ డిటర్జెంట్ తో కలపండి. 
 

44
microfiber

microfiber


మైక్రోఫైబర్ క్లాత్

మీరు గోడలకు అంటిన మరకలను తొలగించడానికి మీరు మైక్రోఫైబర్ క్లాత్ ను కూడా ఉపయోగించొచ్చు. వీటితో పాటుగా గోడలపై ఉన్న పెయింట్ మరకలను తొలగించేందుకు స్పెషల్ గా తయారుచేసిన ఎన్నో రకాల క్లీనర్లు మార్కెట్లో దొరుకుతాయి.

గోడలపై ఎప్పుడో పడిన మరకలను వీటితో పోగొట్టలేం. గోడలపై పడిన ఫ్రెష్ మరకలను అయితే వీటితో చాలా సులువుగా పోగొట్టొచ్చు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Stainless steel Bangles:డైలీవేర్ కి వాడినా మెరుపు తగ్గని స్టీల్ గాజులు
Recommended image2
Sunglasses: రోడ్డు పక్కన కొన్న సన్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
Recommended image3
AC Explode: ఈ పొరపాట్లు చేస్తే.. ఏసీలు బాంబ్ లా పేలిపోతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved