MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇంట్లో చీమలు, దోమలు, బొద్దికలు, ఈగలు ఎక్కువయ్యాయా? ఇలా చేస్తే మీ ఇంట్లో ఇవి ఒక్కటికూడా ఉండవ్

ఇంట్లో చీమలు, దోమలు, బొద్దికలు, ఈగలు ఎక్కువయ్యాయా? ఇలా చేస్తే మీ ఇంట్లో ఇవి ఒక్కటికూడా ఉండవ్

వాతావరణం మారుతున్న కొద్దీ ఇంట్లోకి కీటకాలు రావడం మొదలవుతుంది. చాలా మందికి వీటిని ఇంట్లోకి రాకుండా చేయడానికి, ఇంట్లోంచి పోగొట్టడానికి ఏం చేయాలో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో మీరు కొన్నిసింపుల్ టిప్స్ ను ఫాలో అయితే మీ ఇంట్లోకి ఏ ఒక్క కీటకం కూడా రాదు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 26 2024, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఏదో ఒక మూలన బొద్దింకలు, చీమలు, దోమలు లేదా మరేదైనా పురుగులు ఉంటాయి. కానీ ఇవన్నీ ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి. నిజానికి ఇవన్నీ పర్యావరణానికి చాలా అవసరం. కానీ ఇండ్లలో ఉంటే లేనిపోని రోగాలు వస్తాయి. ఇల్లు కూడా నీట్ గాఅనిపించదు. అందులోనూ ఈగలు ఎన్నోరోగాలను మోసుకొస్తాయి. అందుకే వీటిని ఇంట్లోకి రానీయకూడదు.  అందుకే చాలా మంది ఇంట్లో పురుగులు ఉండకుండా పురుగుల మందు పిచికారి చేస్తుంటారు. దీనివల్ల కీటకాలన్నీ పారిపోతాయి. కానీ మన ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ఇంట్లో బొద్దింకలు, చీమలు, దోమలు, ఈగలే కాకుండా చెద పురుగులు, బెడ్ బగ్స్ కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. పురుగుల మందు పిచికారి చేయకుండా చాలా సింపుల్ గా వీటిని ఇంట్లోనుంచి వెళ్లగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

36


వెల్లుల్లి 

ప్రతి ఒక్కరి వంటింట్లో వెల్లుల్లి ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీన్ని ఫుడ్ లోనే కాకుండా కీటకాలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగించొచచు. 

వెల్లుల్లితో ఏం చేయాలంటే?

1 వెల్లుల్లి రెబ్బ, 1 చిన్న ఉల్లిపాయను తీసుకుని తురమండి. లేదా ప్యూర్ గా తయారు చేయండి. ఇప్పుడు దీంట్లో 1 టీస్పూన్ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపండి. తర్వాత దీంట్లో 1 లీటర్ నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటు అలాగే ఉంచండి. 2 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్ లో పోయండి. దీంట్లో మీరు కావాలనుకుంటే 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను కూడా కలపొచ్చు. ఇది మీ ఇష్టం. కానీ ఆలివ్ నూనె కొన్ని రకాల కీటకాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పురుగులున్న ప్రదేశంలో స్ప్రే చేయండి. రాత్రిపూట చల్లి ఉదయాన్నే ఇంటిని  భాగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అయితే పిల్లలు ఇక్కడ ఆడుకోకుండా చూడాలి. 
 

46

ఫుడ్ దగ్గర ఈగలు వాలకుండా ఏం చేయాలి? 

చాలా మటుకు ఈగలు ఫుడ్ దగ్గరే ఎక్కువగా వాలుతుంటాయి. ఇవి వాలకుండా ఉండాలంటే ఒక గాజు గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్, 2 టీస్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ ను బాగా కలపండి. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ వాసన వస్తుంది. దీంతో కీటకాలు దాని దగ్గరకు వస్తాయి. అయితే డిష్ వాష్ ద్రవం రసాయనం అవి అక్కడే చనిపోతాయి. ఈ పద్ధతి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

56

చీమలు, బొద్దింకలు బయటకు పోవాలంటే? 

ఇంట్లో చీమలు, బొద్దింకలు అంత సులువుగా బయటకు పోవు.  అయితే మీరు వీటిని చాలా సులువుగా బయటకు పోగొట్టే మార్గం ఒకటి ఉంది.బోరాక్స్, బేకింగ్ సోడాతో ఇవి ఇంట్లో ఒక్క క్షణం లేకుండా చేయొచ్చు. ఇందుకోసం బోరాక్స్, బేకింగ్ సోడాను బ్రెడ్ ముక్కలతో మిక్స్ చేసి చీమలు,  బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఉంచండి. ఇది మనుషులకు ప్రమాదకరం కాదు. కానీ ఇది బొద్దింకలు చనిపోయేలా చేస్తుంది. కానీ ఇది ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులకు చాలా ప్రమాదకరం. అందుకే ఇక్కడికి అవి రాకుండా చూసుకోవాలి. 
 

66

దోమల బెడద 

ఎండాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని ఒక సింపుల్ పద్దతిలో ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా థాయ్ లెమన్ గ్రాస్ ను నీటిని కలిపి 24 గంటలు అలాగే ఉంచాలి. తర్వాత దీన్ని స్ప్రే బాటిల్లో పోసి ఉపయోగించాలి. అయితే మీరు దీన్ని మీ చేతులు, కాళ్లకు అంటించుకోకూడదు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Monsoon Home Care : ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. వానాకాలంలో మీరు, మీ ఇల్లు సేఫ్
Recommended image2
Apple: ఇదొక్కటి స్ప్రే చేస్తే చాలు.. యాపిల్ ముక్కలు నల్లగా మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి
Recommended image3
Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved