Periods: పీరియడ్స్ లో వచ్చే కడుపు ఉబ్బరాన్ని ఇలా నివారించండి..
Periods: నెలసరి సమయంలో ఆడవాళ్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపు నొప్పి, నడుము నొప్పి, నీరసం, వికారం వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి పీరియడ్స్ రావడానికి ఇంకా వారం రోజులు ఉండగానే కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తుంది. ఈ సమస్యతో వారు ఎన్నో ఇబ్బందులను పడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కొన్నిసింపిల్ చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.

Periods: చాలా మంది ఆడవారు పీరియడ్స్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కడుపు నొప్పి, నడుము నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి, నీరసం, ఇర్రిటేషన్ వంటి సమస్యలు వస్తాయి. వీటితో పాటుగా కడుపు ఉబ్బరం సమస్య కూడా వేధిస్తుంటుంది. ఈ సమస్య కొందరికి పీరియడ్స్ వచ్చినప్పుడే వస్తే.. మరికిందరికి మాత్రం నెలసరికి ఇంకా వారం కంటే ఎక్కువ సమయం ఉండగానే మొదలవుతుంది. ఈ పీరియడ్స్ టైం లో వారి శరీరంలో కలిగే మార్పుల మూలంగానే ఇలా కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే నెలసరి రావడానికి ఇంకా వారం రోజులు ఉండగానే మహిళల శరీరంలోని progesterone,Estrogen అనే హార్మోన్ల పరిమాణం మారడం మొదలవుతుంది. అంతేకాదు ఈ సమయంలోనే progesterone అనే హార్మోన్ లెవెల్ కూడా తగ్గుతుంది. తద్వారా Uterine lining విస్తరించి బ్లీడింగ్ అవుతుంది. ఈ మార్పులు జరగడం వల్ల కూడా ప్రేగుల పనితీరు నెమ్మదిస్తుంది. తద్వారా పేగుల్లో ఉప్పు, నీరు పేరుకుపోయి కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. అలాగే పేగులు సంకోచించడం వల్లా కూడా కడుపు ఉబ్బరానికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మరసం: నిమ్మకాయలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బర సమస్యను నిమ్మకాయ రసంతో వదిలించుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బర సమస్యను నియంత్రిస్తుంది. అందుకే ఈ సమస్య ఎదురైనప్పుడు గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే ఉపశమనం పొందవచ్చు.
కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లతో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలొవెరా జ్యూస్: అలొవెరా అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జు మన కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియాను వదిలిస్తుంది. అంతేకాదు ఈ జ్యూస్ కడుపు ఉబ్బర సమస్య నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ సమయంలో కలబంద జ్యూస్ ను రోజుకు రెండు నుంచి మూడు సార్లు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
yoga
వ్యాయామం: నెలసరి సమయంలో చాలా మంది వ్యాయామాలకు దూరంగా ఉంటారు. అయినా ఆ సమయంలో ఎక్సర్ సైజెస్ ను చేయడం కష్టతరమే. కానీ తేలికపాటి వ్యాయామాలను ఈజీగా చేయొచ్చు. వ్యాయామాలు కుదరకపోతే యోగాను చేయొచ్చు. ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బర సమస్య నుంచి బయటపడొచ్చు.
coffee
వీటికి దూరంగా ఉండండి: నెలసరి సమయంలో కాఫీ లేదా టీ, కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బర సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.