MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బాల్కనీలోకి పావురాలు రాకుండా ఏం చేయాలి?

బాల్కనీలోకి పావురాలు రాకుండా ఏం చేయాలి?

ఊర్లలో పావురాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ సీటీల్లో మాత్రం పావురాలు చిరాకు తెప్పిస్తాయి. ఇవి తరచుగా ఇంటి బాల్కనీలో తిష్ట వేస్తుంటాయి. ఏం చేసినా ఇవి మాత్రం అక్కడి నుంచి కదలవు. కానీ పావురాల వల్ల లేనిపోని వ్యాధులు వస్తాయి. మీ ఇంటి చుట్టుపక్కలకి, బాల్కనీలోకి పావురాలు రాకుండా చేయడంలో కొన్ని మొక్కలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 21 2024, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
pigeons

pigeons

సిటీల్లో పావురాలతో విసిగిపోయేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా ఇవి బాల్కనీలో, ఇంటి పై కప్పుపై తిష్టవేసి మొత్తం మురికిగా మారుస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. పావురాల రాకతో ఇళ్లు మొత్తం దుమ్ము దుమ్ము అవుతుంది. అలాగే అవి బాల్కనీ నుంచి ఇంట్లోకి వస్తాయి. పావురాల ఈకలు నుంచి ధూళిని వ్యాపింపజేస్తాయి. ఇంటిని , బాల్కనీని ఎంత శుభ్రం చేసినా ప్రతిరోజూ పావురాలు మురికిగా చేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని మొక్కలతో ఇంటి చుట్టుపక్కలకు పావురాలు రాకుండా చేయొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పావురాలు రాకుండా చేసే మొక్కలు

కాక్టస్ మొక్క

ఇంట్లో కాక్టస్ మొక్కను నాటడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఈ మొక్క పావురాలను ఆ చుట్టుపక్కల లేకుండా చేస్తుంది. అవును పావురాలకు కాక్టస్ మొక్క ముళ్లు అస్సలు నచ్చవు. అందుకే ఈ మొక్క నుంచి దూరంగా పారిపోతాయి. 
 

36

డాఫోడిల్ లేదా నర్గీస్ మొక్క

డాఫోడిల్ లేదా నర్గీస్ అని పిలువబడే ఈ మొక్క  పువ్వు వాసన చాలా బాగుంటుంది. దీని వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఇది చి చిన్న చిన్న కీటకాలు, దోమలను దూరంగా ఉంచుతుంది. అలాగే పావురాలను  కూడా దానిచుట్టు పక్కల లేకుండా చేస్తుంది. 
 

46
Garlic

Garlic

వెల్లుల్లి మొక్క

ఎన్ని చేసినా మీ ఇంటికి, బాల్కనీలోకి పావురాలు వస్తున్నట్టైతే పావురం వచ్చే వెళ్లే చోట ఒక వెల్లుల్లి మొక్కను ఉంచండి. ఎందుకంటే పావురాలు వెల్లుల్లి మొక్క నుంచి వచ్చే వాసనను ఇష్టపడవు. అవి దాని చుట్టూ తిరగవు. అంతేకాకుండా మీరు వెల్లుల్లిని వంటలకు కూడా ఉపయోగించొచ్చు. 

56

సిట్రోనెల్లా

సిట్రోనెల్లా మొక్కను ధూపం కర్రల తయారీకి ఉపయోగిస్తారు. ఈ మొక్క నుంచి దోమల నివారిణి ధూపం కర్రలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ మొక్క వాసనకు ఆ చుట్టు పక్కలకు ఒక్క కీటకం కూడా రాదు. ఒక్క కీటకాలే కాకుండా పావురాలు కూడా మీ ఇంటికి దూరంగా ఉంటాయి. 
 

66

పుదీనా మొక్క

పుదీనా వాసన ఎంత బలమైన వాసన వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దీన్ని మనం చాలా వంటల్లో వేస్తుంటాం. కానీ పుదీనా వాసన మాత్రం పావురాలకు అస్సలు నచ్చదు. మీ ఇంటి బాల్కనీలో పుదీనా మొక్కను నాటితే మీ ఇంట్లోకి పావురాల రాక చాలా వరకు తగ్గుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Date Night Outfits: జెన్ జీ అమ్మాయిలు మెచ్చే పార్టీ వేర్ డ్రెస్సులు
Recommended image2
Chanakya Niti: స్మశానం ఒక్కటే కాదు.. ఈ ప్లేస్ కి వెళ్లినా కూడా వెనక్కి తిరిగి చూడకూడదు..!
Recommended image3
Apple Farming: మీ పెరట్లో పొట్టి ఆపిల్ మొక్కలు ఎంత సులువుగా పెంచేయచ్చో తెలుసా.. ఇవిగో సూపర్ టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved