ఈ పిండితో ఇంట్లో ఒక్క ఎలుక లేకుండా పారిపోతాయి
ఇంట్లో ఎలుకలుంటే ఇల్లంతా గందరగోళంగా కనిపిస్తుంది. ఇవి ఇంటిని మురికిగా మార్చడంతో పాటుగా మనల్ని జబ్బుల బారిన కూడా పడేస్తాయి. అయితే ఒక పిండి ముద్దతో ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు.
rats
ఇంట్లో బల్లులు, ఎలుకలు ఉంటే చిరాకు పెడుతుంది. ఎందుకంటే ఇవి ఇంటిని మురికిగా మారుస్తాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి. మనల్ని జబ్బుల బారిన పడేస్తుంటారు. ముఖ్యంగా ఎలుకలు ఇంట్లో ఉన్న బట్టలను, పేపర్లను కొరికి పాడు చేస్తుంటాయి. కానీ ఎలుకలను పట్టుకోవడం, వాటిని ఇంట్లో నుంచి తరిమికొట్టడం అంత సులువైన పని కాదు. చాలా మంది ఎలుక బోను కూడా పెడుతుంటారు. కానీ ఇవి మాత్రం పడవు.
అలాగే మార్కెట్ లో దొరికే వాటితో ఎలుకలు ఇంట్లో లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మందులను వాడుతుంటారు. అయినా ఇంట్లో ఉన్న ఎలుకలు మాత్రం ఎటూ పోవు. కానీ ఒక చిన్న పిండి బంతితో ఎలుకలు పారిపోయేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గోధుమ పిండితో ఎలుకలు పరార్..
ఇంట్లో నుంచి ఎలుకలను తరిమికొట్టడానికి ఇక నుంచి మీరు తిప్పలు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న గోధుమ పిండి ముద్ద ఉంటే చాలు. అవును గోధుమ పిండి బాల్ తో ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేయొచ్చు. ఇందుకోసం గోధుమ పిండిని కలిపి పెట్టుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు, టీ ఆకులు, బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ ను సపరేట్ గా మెత్తని పౌడర్ లా చేయండి.
ఇప్పుడు గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి దాని మధ్యలో తయారుచేసుకున్న పౌడర్ ను వేసి బాల్స్ చేయండి. ఇదేవిధంగా వీలైనన్ని బాల్స్ ను చేయండి. వీటిని ఎలుకలు ఎక్కువగా తిరిగే మూలల్లో ఉంచండి. వీటిని తిన్న ఎలుకలు ఇంట్లో ఒక్కటి కూడా లేకుండా పోతాయి. ఈ ట్రిక్ ఇంట్లో ఎలుకలను లేకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
వీటిని పిండి ఉండల్లో కలపొచ్చు
ఇంట్లో నుంచి ఎలుకలను తరిమికొట్టడానిక మీరు గోధుమ పిండి బంతులకు పొగాకు, ఎండు మిరపకాయలు, దేశీ నెయ్యిని కూడా జోడించొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో పొగాకు, ఎండుమిర్చి పొడి, నెయ్యి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక పిండి బంతి తీసుకుని దాని మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టి బంతిగా తయారుచేయండి. వీటిని ఇంట్లోని అన్ని మూలల్లో పెట్టండి. నిజానికి నెయ్యి వాసన ఎలుకలను బాగా ఆకర్షిస్తుంది. ఇకపోతే పొగాకు మత్తు పదార్థం కాబట్టి.. వీటిని తిన్న వీటిని తిన్న తర్వాత అవి ఇంటి నుంచి వెళ్లిపోతాయి.
గోధుమ పిండి బంతుల్లో ఘాటైన సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తే మరింత మంచి ఫలితాలను చూస్తారు. ఇందుకోసం మీరు ఎర్ర మిరప, పొగాకు, బిర్యానీ ఆకు,వెల్లుల్లి, మిరియాలు లేదా యూకలిప్టస్ నూనెను కూడా ఉపయోగించొచ్చు. వీటన్నిటినీ ఉపయోగించి పిండి బంతులను ఒకే విధంగా తయారుచేయొచ్చు.
rats
ఇవి గుర్తుంచుకోండి
ఎలుకలను ఇంట్లో లేకుండా చేయడానికి మీరు ఈ పిండి బంతులను తయారుచేసినప్పుడు పిల్లలు, పెంపుడు జంతువులను వీటికి దూరంగా ఉంచాలి. అలాగే ఈ బాల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే పిండి ఎండిపోతే దానిని పారేసి కొత్త బాల్ ను పెట్టండి. ఎందుకంటే ఎలుకలు పొడి పిండి బంతుల దగ్గరికి రావు.