ఇంట్లో బల్లులను ఎలా వెళ్లగొట్టాలి?
ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండటం చాలా కామన్. కానీ ఇవి చిరాకు కలిగిస్తాయి. కానీ ఇవి మాత్రం దొరకవు. కొంతమంది ఎంతకీ బల్లులు బయటకుపోవడంతో వాటిని చంపేస్తుంటారు. కానీ వీటిని చంపకుండా సులువుగా వెళ్లగొట్టేందుకు కొన్ని చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే?
సీజన్లతో సంబంధం లేకుండా ఇంట్లోని హాల్, కిచెన్, బాత్రూం, బెడ్ రూం లో బల్లులు కనిపిస్తుంటాయి. ఈ బల్లులు ఇంట్లోకి వచ్చిన పురుగులను తింటూ అటూ ఇటూ తిరుగుతుంటాయి. చాలా మందికి బల్లులను చూస్తేనే చిరాకు కలుగుతుంది. వీటిని ఇంట్లోంచి తిరిమికొట్టేందుకు కెమికల్స్ ప్రొడక్స్ ను ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది మంది బల్లులను చంపేందుకు స్ప్రేలు లేదా మందులను కూడా వాడుతుంటారు. కానీ వీటిని చంపకుండా ఇంట్లోంచి వెళ్లగొట్టే చిట్కాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే?
black pepper
మిరియాలతో..
తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, ధనియాల పొడి వంటి ఘాటైన మసాలా దినుసుల వాసనతో ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేయొచ్చు. అవును ఈ మసాలాల వాసన బల్లులకు అస్సలు నచ్చదు. బల్లులు ఇంట్లోంచి బయటకు పోవాలంటే ఈ మసాలా దినుసులను నీటిలో కలిపి, బల్లులున్న ప్రదేశంలో పిచికారి చేయండి. కావాలనుకుంటే మీరు దీని పొడిని మూలల్లో కూడా చల్లుకోవచ్చు.
Lizard at home
పొగాకుతో..
పొగాకుతో కూడా ఇంట్లో బల్లులు లేకుండా చేయొచ్చు. అవును పొగాకు ఘాటైన వాసన బల్లులను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం నీటిలో కొద్దిగా పొగాకు కలిపి ద్రావణాన్ని తయారుచేసి పిచికారీ చేయండి.
garlic
వెల్లుల్లి, ఉల్లిపాయలతో..
వెల్లుల్లి, ఉల్లిపాయలకు కూడా బల్లులు భయపడతాయి. వీటి ఘాటైన వాసన ఇంట్లో ఒక్క బల్లి లేకుండా చేస్తాయి. ఇందుకోసం వీటిని పచ్చిగా అలాగే వాడొచ్చు లేదా వీటి రసాన్ని తీసి వాడొచ్చు. వీటిని మూలల్లో పెట్టాలి. మీరు కావాలనుకుంటే వీటిని నీటిలో కలిపి స్ప్రేను కూడా తయారు చేయొచ్చు. బల్లులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో దీన్ని చల్లితే అవి వెంటనే అక్కడి నుంచి పారిపోతాయి.
పుదీనాతో..
బల్లులకు పుదీనా వాసన అస్సలు నచ్చదు. మీ ఇంట్లో ఉన్న బల్లులను తరిమికొట్టడానికి ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం పుదీనా ఆకులను మూలలలో పెట్టాలి. కావాలనుకుంటే పుదీనా నూనెను నీటిలో కలపడం స్ప్రే చేస్తే కూడా ఇంట్లో ఒక్క బల్లి లేకుండా బయటకు పోతాయి.
కర్పూరంతో..
కర్పూరం ఘాటైన వాసన బల్లులను దూరంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు కర్పూరం ముక్కను మూలల్లో ఉంచాలి. లేదా స్ప్రే చేయొచ్చు. ఇందుకోసం మీరు కర్పూరాన్ని నీటిలో కలిపి స్ప్రే తయారుచేయాలి.
బల్లులను తరిమికొట్టే కొన్ని ఇతర చిట్కాలు
మీ ఇంటి తలుపులను, కిటికీలను మూసే ఉంచండి.
బయటి నుంచి వచ్చే కాంతిని తగ్గించండి. ఎందుకంటే ఇది బల్లులను ఆకర్షిస్తుంది.
మీ ఇంటి చుట్టూ చెట్లు, పొదలు లేకుండా చూసుకోండి. దీంతో బల్లులు ఇంటికి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఆహార పదార్థాలను ఓపెన్ చేసి ఉంచకూడదు.