MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇంట్లోంచి బొద్దింకలను ఎలా వెళ్లగొట్టాలి?

ఇంట్లోంచి బొద్దింకలను ఎలా వెళ్లగొట్టాలి?

ఒక్క బాత్ రూముల్లోనే కాదు కిచెన్, బెడ్ రూముల్లో కూడా బొద్దింకలు ఉంటాయి. చాలా మందికి ఈ బొద్దింకలను ఎలా తరిమికొట్టాలో తెలియదు. కొన్ని సింపుల్ చిట్కాలతో మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే? 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 04 2024, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చాలా మంది ఇండ్లలో బొద్దింకలు ఉంటాయి. ఇవి ఎక్కువగా బాత్ రూం, కిచెన్ రూముల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఇవి మనం చూడగానే లోపలికి వెళ్లిపోతుంటాయి. ఈ బొద్దింకలు వంటింట్లో ఆహారాలు, పానీయాలను పాడు చేస్తాయి. వీటిని పొరపాటున కూడా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి బొద్దింకలను ఇంట్లో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25

బిర్యానీ ఆకులు 

బిర్యానీ ఆకులను మనం బిర్యానీతో పాటుగా చాలా వంటల్లో వేస్తుంటాం. ఇవి ఫుడ్ ను టేస్టీగా, మంచి వాసన వచ్చేలా చేస్తాయి. అయితే ఈ ఆకులను ఉపయోగించి బొద్దింకలను ఇంట్లో నుంచి వెళ్లగొట్టొచ్చు. అవును బొద్దింకలను వదిలించుకోవడానికి బిర్యానీ ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు బిర్యానీ ఆకులను గ్రైండ్ చేసి వేడినీటిలో మిక్స్ చేసి వంటగదిలో స్ప్రే చేయండి.
 

35


లవంగాలు 

బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి మీరు లవంగాలను కూడా ఉపయోగించొచ్చు. మీ వంటింట్లో బొద్దింకలు ఉన్నట్టైతే వాటిని తరిమికొట్టడానికి మీ వంటగదిలో 8-10 లవంగాలను అక్కడక్కడ పెట్టండి. వీటి వాసనకు బొద్దింకలు ఆ దరిదాపుల్లోకి కూడా రావు.  ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బొద్దింకలను వదిలించుకోవడానికి ఇది సులభమైన మార్గం.
 

45
Cockroaches

Cockroaches

బేకింగ్ సోడా

బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి కూడా బేకింగ్ సోడా కూడా చాలా ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక కప్పు నీటిలో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి కొద్దిగా చక్కెర మిక్స్ చేయండి. దీన్ని వంటగదిలో మొత్తం స్ప్రేతో స్ప్రే చేయండి. 

55
cockroaches

cockroaches

కిరోసిన్ 

మీరు బొద్దింకలతో విసిగిపోతే కిరోసిన్ ను వాడి వాటిని ఇంట్లో నుంచి బయటకు పంపొచ్చు. దీనికోసం మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. కిరోసిన్ ను స్ప్రే బాటిల్ లో పోసి బొద్దింకలు ఉన్న చోట స్ప్రే చేయండి చాలు. దీనివల్ల కూడా ఇంట్లో ఒక్క బొద్దింక ఉండదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sabja Water: ఎండాకాలంలో సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా?
Recommended image2
Polki Earrings: పోల్కీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే రాయల్ లుక్ మీదే!
Recommended image3
Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved