- Home
- Life
- టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకోసారి మార్చాలి? అసలు ఒకే బ్రష్ ను ఎక్కువ రోజులు వాడితే ఏమౌతుందో తెలుసా?
టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకోసారి మార్చాలి? అసలు ఒకే బ్రష్ ను ఎక్కువ రోజులు వాడితే ఏమౌతుందో తెలుసా?
బట్టలైనా, షూలైనా, బ్రష్ లైనా కొన్ని రోజుల వరకే మాత్రమే వాడాలి. అవి పూర్తిగా పాడైపోయే వరకు యూజ్ చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోటిని శుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. అందులో రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల లైఫ్ టైం పెరుగుతుందని తాజా అధ్యయనం కూడా వెల్లడించింది. అందులోనూ నోరు ఎంత శుభ్రంగా ఉంటే అన్ని అనారోగ్య సమస్యల ప్రమాదం తప్పుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నానరు. ఇది బాగానే ఉంది కానీ.. ఇంతకీ బ్రష్ ను ఎన్ని రోజులకోసారి మార్చాలి. ఎక్కువ కాలం ఒకే బ్రష్ ను వాడితే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకుందాం పదండి.
టూత్ బ్రష్ లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చేత్తో పట్టుకుని పట్టుకుని దంతాలను తోమేవి. రెండోది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. ఎవరి కంఫర్ట్ ను బట్టి వాళ్లు నచ్చిన దాన్ని వాడుతుంటారు. అయితే ఎలక్ట్రిక్ బ్రష్ కు ఛార్జింగ్ అవసరం. అందులోనూ దీని ఒత్తిడి మన నియంత్రణ ఉండదు. అదే మన చేతులను తోమే బ్రష్ లు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. చిగుళ్లపై ఒత్తిడి పూర్తిగా మన నియంత్రణలో ఉంటుంది. అదే ఎలక్ట్రానిక్ బ్రష్ అయితే అంతర్నిర్మిత సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఒక వేళ దీనితో ఎక్కువ సేపు బ్రష్ చేస్తే దంతాలు దెబ్బతింటాయి.
Toothbrush
టూత్ బ్రష్ ను ఎలా మెయింటైన్ చేయాలి
మీరు ఏ రకమైన బ్రష్ ను ఉపయోగించినా.. దానిని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సూచించిన ప్రకారం.. బ్రష్ ను ఉపయోగించిన తర్వాత దాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత బ్రష్ ను నిటారుగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల అది తొందరగా ఆరుతుంది. తేమ కూడా పోతుంది. మాయిశ్చరైజ్డ్ టూత్ బ్రష్ లను క్లోజ్డ్ కంటైనర్ లో పెడితే.. వాటిపై సూక్ష్మజీవులు జీవిస్తాయి.
టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకోసారి మార్చాలి
ప్రతి ఒక్కరూ తమ తమ టూత్ బ్రష్ లను 3 నుంచి 4 నెలలకోసారి ఖచ్చితంగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు ఎలాంటి అనారోగ్య సమస్యను ఫేస్ చేస్తున్నట్టైతే ఈ సమయం కంటే ముందుగానే బ్రష్ ను చేంజ్ చేయాలి. brush bristles పాడైతే దంతాలు పూర్తిగా క్లీన్ కావు. దానితోనే దంతాలను క్లీన్ చేయడం వల్ల పంటినొప్పి కలుగుతుంది. ఎందుకంటే పిల్లల కంటే పెద్దలే కఠినంగా బ్రష్ చేస్తారు.
ఒకే బ్రష్ ను ఎక్కువ రోజులు ఉపయోగిస్తే ఏమౌతుంది
ఒకే టూత్ బ్రష్ ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల బ్రష్ లో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీని వల్ల దంతక్షయం బారిన పడొచ్చు. అందుకే టూత్ బ్రష్ లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అందులోనూ ఎక్కువ కాలం ఒకే బ్రష్ తో దంతాలను తోమడం వల్ల దంతాలు పూర్తిగా క్లీన్ కావు. అందుకే బ్రష్ ను తప్పని సరిగా మార్చాలి.
జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత బ్రష్ లను ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు పళ్లు తోముకున్నప్పుడు బ్యాక్టీరియా బ్రష్ కు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు మళ్లీ అనారోగ్యం బారిన పడొచ్చు. అందుకే అలాంటప్పుడు బ్రష్ ను మార్చండి.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే హార్డ్ గా ఉండే బ్రష్ లను ఉపయోగించడం మానేయండి. ఇవి దంతాలను దెబ్బతీస్తాయి. అందుకే స్మూత్ గా ఉండే త్రెడ్ బ్రష్ ను ఉపయోగించండి. ఇవి దంతాలను దెబ్బతినకుండా చూస్తాయి.