MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చెవులే లేని పాములు ఎలా వినగలుగుతాయబ్బా? పాముల గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు

చెవులే లేని పాములు ఎలా వినగలుగుతాయబ్బా? పాముల గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు

పాములంటేనే భయపడి చచ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. నిజానికి పాములు చాలా విషపూరితమైనవి. కానీ ఇవి ఒక రహస్యమైన, అద్భుతమైన జీవి. పాముల గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 03 2024, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పాములు ఫోన్లలోనే కాకుండా.. రియల్ గా చూసిన వాళ్లు చాలా మంది ఉంటారు. పాములంటే కొంతమందికి  చచ్చేంత భయం ఉంటుంది. ఎందుకంటే ఈ పాము కాటు అంత డేంజర్ కాబట్టి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పాముకాటుతో చనిపోతున్నారు. నిజానికి పాములు ఊరికే మనుషులను కాటేయవన్నది నిజం.

వాటి దారికి మనం అడ్డుగా వెళితేనే మనపై దాడిచేస్తాయి. అయితే పాములు చిన్న కదలికను కూడా చాలా స్పష్టంగా వినగలుగుతాయి. అందుకే చెవులు బాగా వినిపించే వారిని నీవి పాము చెవులు అని అంటుంటారు. నిజానికి పాములకు చెవులే ఉండవు. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉంటుంది.

కానీ అవి శబ్దాలను ఎలా వినగలుగుతాయనేదే పెద్ద ప్రశ్న. అసలు పాములకు ఎలా వినిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పాములు వింటాయా?

నిజానికి పాములకు బాహ్య చెవులు మొత్తమే ఉండవు. కానీ లోపలి చెవులు మాత్రం ఉంటాయట. అందుకే పాములు ప్రతి శబ్ధాన్ని వినగలుగుతాయి. పాముల లోపలి చెవి ధ్వని ప్రకంపనలను గుర్తించగలదు. మానవులు 20 నుంచి 20 వేల హెర్ట్జ్ శబ్దాలను వినగులుగుతారు. అయితే పాములు మాత్రం 200 నుంచి 300 హెర్ట్జ్ శబ్దాలను వినగలుగుతాయి తెలుసా? 

భూమి ప్రకంపనలను వింటాయి

పాములు దవడ ఎముకల ద్వారా భూమి ప్రకంపనలను గుర్తిస్తాయట. పాముల దవడ ఎముక ఈ ప్రకంపనలను లోపలి చెవికి ప్రసారం చేస్తుంది. ఇది ధ్వనిని గుర్తించడానికి సహాయపడుతుంది. మీకు తెలుసా? పాములకు అసలే వినడబడదు. కానీ ఇవి వాటి నాలుకతోనే కమ్యూనికేట్ చేస్తాయి. 
 

35

పాము చర్మం ప్రత్యేకం

పాములు తమ చర్మం నుంచే శబ్దాన్ని వినగలుగుతాయి. ఈ శబ్దం వాటి మెదడుకు వెళుతుంది. పాముల్లో ఉండే ఈ గుణాల వల్ల వాటిపై ఎవరు దాడి చేస్తున్నారో అవి ఈజీగా తెలుసుకోగలుగుతాయి. 

అన్ని పాములు గుడ్లు పెట్టవు

అవును.. సరీసృపాలు క్షీరదాల కంటే చాలా భిన్నంగా ఉంటాయన్న సంగతిని స్కూళ్లోనే తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే పాములు పిల్లలను కనకుండా గుడ్లు పెడతాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ సుమారు 70% పాములు మాత్రమే గుడ్లు పెడతాయట. మిగతా పాములు గుడ్లను పెట్టవు.

ముఖ్యంగా చల్లని వాతావరణంలో నివసించే పాములు గుడ్లు పెట్టకుండా పిల్లలను కంటాయి.  ఎందుకంటే గుడ్లు చల్లని వాతావరణంలో మనుగడ సాగించవు.
 

45

పాములకు కనురెప్పలు ఉండవు

పాములెందుకు అంత భయంకరంగా ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా?ఇందుకు అసలైన కారణం వాటికి కనురెప్పలు లేకపోవడమే. అవును పాములకు కనురెప్పలు ఉండవు. వీటివల్ల అవి ఎప్పుడూ కళ్లు తెరిచే ఉంచుతాయి. అలాగే నిద్రపోతున్నప్పుడు కూడా వాటి కండ్లు తెరిచే ఉంటాయి.

అయితే వాటి కళ్లను రక్షించడానికి కనురెప్పలు లేకపోవడం వల్ల అవి ప్రతి కంటికి సన్నని పొరను కలిగి ఉంటాయి. ఈ పొరను 'బ్రిల్' అని అంటారు.  జర్మన్ భాషలో దీనికి అద్దాలు అని అర్థం.

55
snakes

snakes


పాములు నాలుకతో వాసన చూస్తాయి

పాములకు కూడా మనుషుల లాగే ముక్కు రంధ్రాలు ఉంటాయి. కానీ అవి వాసన చూడటానికి  ఉపయోగించవు.  పాములు నాలుకతోనే వాసన చూస్తాయి. పాములకు అద్బుతమైన వాసన చూసే లక్షణం ఉంటుంది. అందుకే  "స్టీరియోలో వాసన" అని కూడా వర్ణించబడింది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Son: ఇలాంటి కొడుకు కుటుంబాన్నే నాశనం చేస్తాడు.. చిన్నప్పుడు సరిదిద్దాలి
Recommended image2
Silver Nosering: చీరలపై వెండి ముక్కుపుడకలు.. మోడ్రన్ లుక్ అదిరిపోతుంది
Recommended image3
Pearl Mangalsutra:ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved