ఎలుక వినాయకుడి వాహనంగా ఎలా మారింది? ఆ రహస్యం ఇదిగో
వినాయక చవితి రోజు వినాయకుడితో పాటు పక్కనే ఎలుకను పెట్టి పూజించే సాంప్రదాయం ఉంది. మీరు వినాయకుడి విగ్రహాన్ని కొన్న తరువాత అక్కడ ఈ ఎలుక బొమ్మ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎలుకకు వినాయకుడికి మధ్య అనుబంధం ఏమిటి?

వినాయకుడి వాహనం ఎలుక
హిందూ మతంలో అతి ముఖ్యమైన పండగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి రోజు ప్రతి ఇంట్లోని వినాయక విగ్రహానికి ఘనంగా పూజలు చేస్తారు. ఆ విగ్రహం పక్కనే ఒక ఎలుక కూడా కచ్చితంగా ఉంటుంది. సాధారణంగా ఇంట్లో ఎలుకలకి స్థానం ఇవ్వని ప్రజలు వినాయకుడితో పాటు ఎలుకను పూజించేందుకు కారణం ఉంది. ఎందుకంటే ఎలుకను వినాయకుడి వాహనంగా చెప్పుకుంటారు. గ్రంథాల ప్రకారం ఎలుక ఎంతో ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుందని నమ్ముతారు. ప్రతి దేవతకు వాహనంగా ఏదో ఒక జీవి ఉంటుంది. అలా గణేషుడికి ఎలుక వాహనంగా దక్కింది. ఇలా ఎలుక వినాయకుడి వాహనంగా ఎందుకు మారింది?
ఎలుకే ఎందుకు?
గణేషుడిని సిద్ధి ధాత అని పిలుస్తారు. విఘ్నాధిపతిగా కొలుస్తారు. ఇక అతడి వాహనం ఎలుక. ఎలుక వాస్తవానికి మనిషిని సూచిస్తుంది. మనిషి ఎంత చంచలమైన, అదుపు లేని కోరికలను కలిగి ఉంటాడో... ఎలుక కూడా అదే విధంగా కలిగి ఉంటుంది. అహం వీటికి అధికం. ఎలుకపై గణేషుడు కూర్చోవడం వల్ల అతడు ఆ చంచలత్వాన్ని, అహాన్ని, కామాన్ని, కోరికలను నియంత్రించాలని ప్రయత్నిస్తాడు. ఎలుక పై కూర్చున్న గణేశుడు కోరికలను నియంత్రించాలని ప్రజలకు సూచిస్తాడు.
ఎలుక స్వభావం
ఎలుక స్వభావం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అది చిన్నచిన్న రంధ్రాల గుండా కూడా ప్రయాణాలు చేస్తుంది. కష్టమైన సమస్యలకు కూడా పరిష్కారాలను కనుగొనడం సులభమని అని చెప్పడమే ఎలుక ఇస్తున్న సందేశం. పరిమాణంలో చిన్నగా ఉన్నా కూడా ఈ జీవి కఠినమైన వస్తువులను కూడా కొరికి పడేస్తుంది. ఇది దృఢ సంకల్పాన్ని సూచిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా గొప్ప విజయాలను అందిస్తాయని చెప్పడమే ఎలుక ఉద్దేశం.
అసలు కథ ఇది
పురాణాలు చెబుతున్న ప్రకారం పూర్వం ముషక్ అని పిలిచే గంధర్వుడు ఉండేవాడు. అతడికి అహంకారం ఎక్కువ. ఓసారి వామనదేవుడు అనే మహర్షిని అతడు అవమానించాడు. ఫలితంగా ఆ మహర్షి గంధర్వుడిని శపించాడు. అతడు శాపం ఫలితంగా ముషక్ అనే గంధర్వుడు ఎలుకగా మారిపోయాడు. ఆ తర్వాత అతడు వినాయకుడిని ఆశ్రయించాడు. అప్పుడు అతడిని తన వాహనంగా చేసుకున్నాడు గణేషుడు. మరొక కథ ప్రకారం గజామూకాసురుడు అనే రాక్షసుడు దేవతలను విపరీతంగా వేధించసాగాడు. అతడిని ఏ ఆయుధం ద్వారా కూడా చంపలేకపోయారు. చివరికి వినాయకుడు అతనితో పోరాడి తన దంతంతో అతనిని ఓడించాడు. ఓడిపోయిన వెంటనే గజమూకాసురుడు ఎలుక రూపాన్ని పొందాడు. అప్పుడు నుంచి గణేశుడికి వాహనంగా అతడు మారాడని చెప్పుకుంటారు.