వినాయక చవితికి బేబీ బంప్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దిష్టి తగిలేంత అందంగా
లావణ్య త్రిపాఠి మరో రెండు మూడు నెలల్లో తల్లి కాబోతోంది. వినాయక చవితికి ఆమె తన భర్తతో కలిసి పూజ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తొలిసారి ఆమె బేబీ బంప్ తో కనిపించింది.

గర్భంతోనే షూటింగ్
అతి త్వరలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లి కాబోతోంది. పెళ్లి పీటలు ఎక్కాక ఆమె సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె సతీ లీలావతి అనే మూవీలో నటించింది. ఆ సినిమా షూటింగ్ అయిపోయినట్టు తెలుస్తోంది. గర్భంతో ఉండగానే ఆ సినిమాలో నటించినట్టు సమాచారం. ఆ సినిమా టీజర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. గర్భం ధరించాక కూడా మొదటి మూడు నెలలు ఆమె సినిమా షూటింగ్లో ఉందని ఆమె అక్క శివాని త్రిపాఠి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మెగా కోడలుగా అయ్యాక లావణ్య త్రిపాఠిలో ఎంతో మార్పు వచ్చింది. ఎలా పడితే అలా సినిమాలను ఒప్పుకోకుండా కుటుంబ జీవితానికి ఆమె ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.
బేబీ బంప్ తో ఫోటో
లావణ్య త్రిపాఠి గర్భవతి అయ్యాక బయట పెద్దగా కనిపించలేదు. తొలిసారి వినాయక చవితి రోజు భర్తతో కలిసి పూజలు చేసి ఆ ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. ఆ పోస్టులో బేబీ బంప్ స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం కూడా భర్తతో కలిసి ఆమె విదేశీ ట్రిప్ కు వెళ్ళింది. అప్పుడు కూడా ఒక ఫోటోలో బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠికి ఏడవ నెల అని తెలుస్తోంది. మరొక రెండు నెలల్లో ఆమెకు ప్రసవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీలోకి మరొక మెగా వారసురాలు లేదా మెగా వారసుడు వచ్చే రాబోతున్నారు.
ప్రేమ పెళ్లి
వరుణ్ తేజ్, లావణ్య కలిసి మిస్టర్ అనే సినిమాలో తొలిసారి నటించారు. అప్పుడే వారికి పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. వరుణ్ తేజ్ ముందుగా లావణ్య కు ప్రపోజ్ చేసినట్టు సమాచారం. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఓకే చెప్పడంతో 2023లోని ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
పెళ్లయిన రెండేళ్లకు
2023లో పెళ్లి అయిన తర్వాత 2025 మేలో లావణ్య గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సినిమాలు చేయకపోయినా లావణ్య ఓటీటీలో వెబ్ సిరీస్లు చేసింది. పులి మేక, మిస్ పర్ఫెక్ట్ వంటి వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది. కానీ పూర్తిస్థాయిలో ఒక్క సినిమాను కూడా పెళ్లి తర్వాత చేయలేదు. తల్లిగా ప్రమోషన్ అయ్యాక కూడా ఆమె కొన్నేళ్ల పాటూ సినిమాలు చేసే అవకాశం కనిపించడం లేదు.