MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Colour of Gold: బంగారానికి ఆ పసుపు రంగు ఎలా వచ్చింది? దీని వెనుక మిస్టరీ ఇదే

Colour of Gold: బంగారానికి ఆ పసుపు రంగు ఎలా వచ్చింది? దీని వెనుక మిస్టరీ ఇదే

Colour of Gold: బంగారం పసుపు రంగులో అందంగా మెరిసిపోతుంది. బంగారానికి అంత చక్కటి రంగు ఎలా వచ్చింది? ఆ మెరుపు వెనుక కారణం ఏమిటి? దీనికి సైన్సు పరంగా చాలా విషయాలు చెప్పుకోవాలి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 01 2026, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారం ఒక లోహం
Image Credit : Asianet News

బంగారం ఒక లోహం

బంగారం ఇప్పుడు అత్యంత విలువైన లోహం. పసుపు రంగులో మెరిసిపోతుంది కాబట్టే  పసిడి అని కూడా పిలుచుకుంటాము.  వెండి బూడిద రంగులో మెరిస్తే, బంగారం పసుపు రంగులో ఉంటుంది. రోజురోజుకీ బంగారంపై పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం వస్తువు పెట్టుకుంటే చాలు ఎంతో కళగా కనిపిస్తారు. అసలు బంగరానికి చక్కటి పసుపు రంగు ఎలా వచ్చింది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రంగు వెనుక సైన్స్
Image Credit : Asianet News

రంగు వెనుక సైన్స్

సైన్స్ ప్రతి విషయానికి ఒక మూలాన్ని కనిపెడుతుంది. అలా బంగారం రంగును కూడా తేల్చింది. సైన్సు చెబుతున్న ప్రకారం ఒక వస్తువు రంగు.. అది ఏ కాంతి తరంగాలను వెనక్కి పంపిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. తెల్లటి వస్తువుపై సూర్యరశ్మి పడినప్పుడు అది కొన్ని రంగులను పీల్చుకుని, మరికొన్నింటిని వెనక్కి పంపిస్తుంది. అలా వెనక్కి వచ్చిన కాంతి మన కళ్లకు చేరినప్పుడు, మెదడు దాని రంగును గుర్తిస్తుంది. అలా ఒక వస్తువు రంగు మన కంటికి కనిపిస్తుంది.

Related Articles

Related image1
Branded clothes: కోట్ల విలువైన కొత్త బ్రాండెడ్ దుస్తులను ఇక్కడ చెత్తలా పడేస్తున్నారు.. ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది
Related image2
Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీకి హోమ్ లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే
34
నీలం, ఊదా రంగులను పీల్చుకుని..
Image Credit : Asianet News

నీలం, ఊదా రంగులను పీల్చుకుని..

వెండి, అల్యూమినియం వంటి చాలా లోహాలు తమపై పడిన కాంతిలోని అన్ని రంగులను వెనక్కి పంపిస్తాయి. అందుకే అవి తెల్లగా లేదా వెండి రంగులో కనిపిస్తాయి. కానీ బంగారం అలా కాదు. తనపై కాంతి పడినప్పుడు అందులోని నీలం, ఊదా రంగు కాంతిని ఎక్కువగా పీల్చుకుంటుంది. ఎరుపు, నారింజ, పసుపు రంగులను మాత్రం మన కళ్ల వైపునకు పంపిస్తుంది. ఆ మూడు రంగుల కలయిక వల్ల మన కంటికి  బంగారానికి పసుపు రంగులో కనిపిస్తుంది.

44
వేగంగా తిరిగే ఎలక్ట్రాన్లు
Image Credit : Asianet News

వేగంగా తిరిగే ఎలక్ట్రాన్లు

బంగారం అటామిక్ నంబర్ 79. ప్రతి బంగారు అణువు కేంద్రకంలో 79 ప్రోటాన్లు ఉంటాయి. ఈ కేంద్రకం చాలా బరువుగా ఉండటం వల్ల, దాని దగ్గరలో ఉన్న ఎలక్ట్రాన్లు బలమైన ఆకర్షణకు లోనవుతాయి. ఈ లోపలి ఎలక్ట్రాన్లు కాంతి వేగంలో సగం వేగంతో, అంటే చాలా వేగంగా తిరుగుతుంటాయి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, అత్యధిక వేగంతో కదిలే కణాల ద్రవ్యరాశి పెరిగినట్లుగా ప్రవర్తిస్తాయి. దీనివల్ల బంగారు అణువులోని లోపలి ఎలక్ట్రాన్ కక్ష్యలు కొద్దిగా కుంచించుకుపోయి, కేంద్రకానికి మరింత దగ్గరగా కదులుతాయి. ఈ మార్పు వల్ల ఎలక్ట్రాన్లు వేర్వేరు శక్తి స్థాయిల మధ్య మారడానికి అవసరమైన శక్తిలో కూడా మార్పు వస్తుంది. ఇదే బంగారం రంగుకు అసలు కారణం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: డైలీవేర్ కి అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు..!
Recommended image2
Pillow: మీ దిండ్లు పసుపు రంగులోకి మారిపోయాయా?రూ.10ఖర్చుతో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు
Recommended image3
Magic Drink: ఈ మ్యాజిక్ డ్రింక్ ప్రతిరోజూ తాగారంటే చర్మం కళకళలాడిపోతుంది
Related Stories
Recommended image1
Branded clothes: కోట్ల విలువైన కొత్త బ్రాండెడ్ దుస్తులను ఇక్కడ చెత్తలా పడేస్తున్నారు.. ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది
Recommended image2
Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీకి హోమ్ లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved