MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పిచ్చి కుక్కకు, మంచి కుక్కకు తేడా ఇదే..! పిచ్చి కుక్కను ఎలా గుర్తించాలంటే?

పిచ్చి కుక్కకు, మంచి కుక్కకు తేడా ఇదే..! పిచ్చి కుక్కను ఎలా గుర్తించాలంటే?

పిచ్చి కుక్కలు మనుషులను కరిచి ప్రాణాలు తీసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే చాలా మందికి పిచ్చి కుక్కను గుర్తించడం రాదు. అసలు పిచ్చి కుక్క ఎలా ప్రవర్తిస్తుంది? మంచి కుక్క ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 19 2024, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొంతమంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడితే.. మరికొంతమంది మాత్రం కుక్కలకు దూరంగా ఉంటారు. కుక్కలను చూస్తేనే భయపడిపోతుంటారు. ఎందుకంటే కుక్కలు కరుస్తాయని. కానీ అన్ని కుక్కలు ప్రమాదకరమైనవి కావు. ప్రమాదకరమైన కుక్కకు, సాధరణ కుక్కకు చాలా తేడాలు ఉంటాయి. కానీ జనాలకు ఇవి తెలియవు. ముఖ్యంగా వీధి కుక్కలను చాలా మంది క్రూరమైనవిగా, పిచ్చికుక్కలుగా భావిస్తారు. వీధి కుక్కలే మనుషులను కరిచి ప్రాణాలను తీస్తాయని అనుకుంటారు. కానీ ప్రతి వీధి కుక్క ఇలాగే ఉండదు. కానీ కుక్క కరిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు హస్పటల్ కు వెళ్లాలి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నిజానికి పిచ్చి పట్టిన కుక్కను చాలా ఈజీగా గుర్తించొచ్చు. పిచ్చి లేని కుక్క మనం అరిస్తే మొరగడం, మీదికి రావడం ఆపేస్తుంది. అదే పిచ్చి కుక్క అయితే అది మనం ఏం చేసినా మీదికి రావడం ఆగదు. కరుస్తుంది కూడా. 

35

మన దేశంలో చాలా వీధి కుక్కల స్వైర విహారం జనాలకు భయం కలిగిస్తోంది. చిన్న పిల్లలను, పెద్దవారిని కరిచి చంపిన ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కొన్ని కొన్ని సార్లు పెంపుడు కుక్కలు కూడా దాడిచేస్తుంటాయి. ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. అందుకే పిచ్చి కుక్కకు, సాధారణ కుక్కకు తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కుక్క కరిచినప్పుడు కూడా ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. 

45
dog attack

dog attack

కుక్క కాటును తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఇది ప్రాణాలను సులువుగా తీసేయగలదు. అందుకే ఒకవేళ కుక్క కరిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. నిపుణుల ప్రకారం.. రేబిస్ వైరస్ వల్లే ఒక మంచి కుక్క.. పిచ్చి కుక్కగా మారుతుంది. చాలా కుక్కలు కుళ్లిపోయిన జంతు మాంసాన్ని తింటుంటాయి. కానీ వీటిలో రేబిస్ వైరస్ ఉంటుంది. చాలా రోజులుగా కుళ్లిపోయిన జంతు మాంసంలో రేబిస్ వైరస్ ఉంటుంది. వీటిని తిన్న కుక్కల శరీరానికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీంతో మంచి కుక్కలు.. పిచ్చి కుక్కలుగా మారుతాయి. 

55

పిచ్చి కుక్కకుండే లక్షణాలు

కుక్కకు పిచ్చి పడితే బద్ధకంగా ఉంటుంది. ఎప్పుడూ నోట్లోనుంచి లాలాజలం, నురగ వస్తుంటాయి. ఈ కుక్కలు ఏదీ తినవు. అయితే ఈ రేబిస్ వైరస్ సోకిన కుక్క ఒకటి రెండు వారాల్లోనే చనిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా పిచ్చికుక్క రోజుకు 100 మందిని కూడా కరవగలదట. ఈ లక్షణాలన్నీ సాధారణ కుక్కలో కనిపించవు. పిచ్చి పట్టిన కుక్కలే ఇలా చేస్తాయి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Benefits: గుడ్డు ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?
Recommended image2
Oversized Jhumka: చీరల మీదకు అదిరిపోయే జుంకాలు.. ఓ లుక్కేయండి
Recommended image3
Pets in Train: ఇక నుంచి మీ పెంపుడు జంతువులు కూడా మీతో రైలు ఎక్కొచ్చు.. ఎలానో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved