వెన్ను నొప్పిని తట్టుకోలేక పోతున్నారా? ఇలా చేయండి తగ్గిపోతుంది..
ఈ రోజుల్లో వెన్ను నొప్పి సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. దీనివల్ల కలిగే నొప్పి మాత్రం మాటల్లో చెప్పలేనిది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం సులువుగా ఈ నొప్పి నుంచి బయటడొచ్చు.

back pain
గంటలకు గంటలు కుర్చీల్లో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి లేదా నడుం నొప్పి వస్తుంది. నడుం నొప్పి రావడానికి ఇదొక్కడే కారణం కాదు. కారణం ఏదైనా ఈ నొప్పి పెట్టే బాధ అంతా ఇంతా కాదు. కూర్చున్నా నొప్పే.. పడుకున్నా నొప్పే.. ఎక్కువ సేపు నిలబడినా నొప్పే, వంగినా నొప్పే.. అందుకే ఈ నొప్పి తగ్గేందుకు మందులు, అయింట్మెంట్ లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ నొప్పి తగ్గేందుకు కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
మసాజ్
మసాజ్ ఎన్నో నొప్పులను తగ్గిస్తుంది. మసాజ్ తో తలనొప్పితో పాటుగా వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమం కలుగుతుంది. నొప్పి ఎక్కువైనప్పుడు అయింట్మెంట్ పెట్టి, లేదా ఏదైనా నూనె రాసి కాసేపు మసాజ్ చేయండి. నొప్పి కాస్త తగ్గుతుంది.
చల్లని లేదా వేడి నీళ్లతో ప్యాక్
నొప్పి మరీ ఎక్కువగా అనిపిస్తే వెంటనే చల్ల నీళ్లు లేదా వేడినీళ్లతో కాపడం పెట్టండి. ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో నొప్పి తగ్గిపోతుంది. ఐస్ క్యూబ్స్ ను పెట్టినా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
హీల్స్ వేసుకోవడం మానేయాలి
హై హీల్స్ వేసుకుంటే కూడా నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీటివల్ల వెన్నుపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకే హై హీల్స్ ను తరచుగా వేసుకోవడం మానేయండి. అంగుళం కంటే ఎక్కువ ఎత్తుండే చెప్పులను వేసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నడక
నడక ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది . రోజూ గంటలకు గంటలు కూర్చునే వారు ప్రతిరోజూ ఒక అర్థగంట అయినా నడవాలి. లేకుంటే నడుం నొప్పి ఎక్కువ అవుతుంది. బరువు పెరిగిపోతారు. గుండె సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వీటన్నింటికీ ఒకటే మందు.. అదే నడక. పనిలో అర్థగంటలకు ఒకసారైనా లేచి అటూ ఇటూ నడవడం వల్ల వెన్ను నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది.
back pain
బరువులు ఎత్తడం
బరువులు ఎత్తడం వల్ల కూడా వెన్ను నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బరువుల వల్ల వెన్నుపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్లే విపరీతమై నొప్పి వస్తుంది. అందుకే బరువు ఎత్తేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.
స్మోకింగ్ మానుకోవాలి
స్మోకింగ్ ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. దీనిలో వెన్ను నొప్పి ఒకటి. స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల నడుం నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో నికోటిన్ ఉంటుంది. ఇది వెన్నెముకలోని ఎముకలకు బలం లేకుండా చేస్తుంది.