ఇంట్లో బల్లులు, బొద్దింకలు, దోమలు, చీమలు ఉండొద్దంటే.. ఈ ఒక్కటి చేస్తే చాలు
ఇల్లు అన్నాక.. చీమలు, దోమలు, బొద్దింకలు, బల్లులు ఉండటం కామన్. కానీ వీటివల్ల ఇల్లంతా మురికిగా కనిపిస్తుంది. అలాగే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఎలాంటి కెమికల్స్ వాడకుండా వీటిని ఇంట్లో లేకుండా చేసే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంటిని ప్రతిరోజూ క్లీన్ చేసినా.. ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బల్లులు, ఈగలు, దోమలు, బొద్దింకలు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా వానాకాలం, చలికాలంలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది.
అందుకే వీటిని ఇంట్లో లేకుండా చేయడానికి మార్కెట్ లో దొరికే కెమికల్స్ ను వాడుతుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి మంచివి కావు. ఈ కెమికల్స్ ను వాడకుండా కూడా ఇంట్లో బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బొద్దింకలను వదిలించుకోవడానికి చిట్కాలు:
ఈ బొద్దింకలు చిరాకు కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా బాత్ రూం, కిచెన్ రూంలో ఎక్కువగా తిరుగుతుంటాయి. వీటిని కొన్ని సింపుల్ చిట్కాలతో తరిమికొట్టొచ్చు. అదెలాగంటే?
- కిరోసిన్ తో ఇంట్లో ఒక్క బొద్దింక లేకుండా చేయొచ్చు. ఎందుకంటే బొద్దింకలకు కిరోసిన వాసన అస్సలు నచ్చదు. దీన్ని స్ప్రే చేస్తే బొద్దింకలు పారిపోతాయి.
- బొద్దింకలను బేకింగ్ సోడాతో కూడా వెళ్లగొట్టొచ్చు. ఇందుకోసం గ్లాస్ నీళ్లలో బేకింగ్ సోడా, పంచదార వేసి కలపండి. దీన్ని స్ప్రే బాటిల్ లో పోసి బొద్దింకలు వచ్చి పోయే దారిలో స్ప్రే చేయండి. ఇక అక్కడికి రానేరావు.
- నిమ్మకాయతో కూడా బొద్దింకలను ఇంట్లో లేకుండా చేయొచ్చు. ఎందుకంటే బొద్దింకలకు నిమ్మకాయ వాసన అస్సలు నచ్చదు. ఇందుకోసం నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి బొద్దింకలు ఉండే చోట పెట్టంది. అక్కడ లేకుండా బొద్దింకలు పారిపోతాయి.
ఇంటి శుభ్రత చిట్కాలు
చీమలను వదిలించుకోవడానికి చిట్కాలు:
చీమలు ఇంట్లో ఉన్న ఆహారాలను పాడు చేస్తాయి. అలాగే మనల్ని కుడతాయి కూడా. అందుకే ఇంట్లో చీమలు లేకుండా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
- ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసాన్ని కలిపి స్ప్రే బాటిల్ లో నింపండి. దీన్ని చీమలు వచ్చే చోట స్ప్రే చేయండి. నిమ్మకాయ వాసన నచ్చక చీమలు అటునుంచి పారిపోతాయి.
- మిరియాల నీటితో కూడా ఇంట్లో చీమలు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం చీమలు వచ్చిపోయే దారిలో మిరియాల నీటిని స్ప్రే చేయండి. చీమలకు మిరియాల వాసన అస్సలు నచ్చదు.
ఇంటి శుభ్రత చిట్కాలు
దోమలను వదిలించుకోవడానికి చిట్కాలు:
వానాకలం, చలికాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమల కాటు వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో దోమలు లేకుండా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
- ఇంట్లో దోమలు లేకుండా చేయడానికి వేప నూనె, లావెండర్ నూనెలు బాగా పనిచేస్తాయి. ఇందుకోసం ఈ రెండింటిని సమానంగా తీసుకుని కలిపి స్ప్రే బాటిల్ పోసి ఇంట్లో అక్కడక్కడ స్ప్రే చేయండి. దీని ఘాటైన వాసనకు ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు.
- కర్పూరంతో కూడా ఇంట్లో దోమలు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం పొగ, దాని వాసనకు ఇంట్లో దోమలు లేకుండా పోతాయి.
- అలాగే రోజ్మేరీ, తులసి, చామంతి వంటి మొక్కలను బాల్కనీలో పెంచినా ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. ఈ మొక్కల వల్ల మీ ఇంటికి అందం కూడా వస్తుంది.
బల్లులను వదిలించుకోవడం ఎలా?
- ఉల్లిపాయతో ఇంట్లో బల్లులు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం ఉల్లిపాయ ముక్కలను నీటిలో నానబెట్టి ఇంటి కిటికీలు, బల్లులు వచ్చే చోట పెట్టండి. ఈ ఉల్లిపాయ ఘాటైన వాసన బల్లులకు అస్సలు నచ్చదు. దీంతో అవి ఇంట్లో నుంచి పారిపోతాయి.
- బల్లులు ఇంట్లో పోవడానికి కాఫీ పొడి, పొగాకు ఆకుల మిశ్రమం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసంపొగాకు ఆకులను చిన్న ముక్కలుగా చించి, వాటికి కాఫీ పొడి కలిపి చిన్న ఉండలుగా చేయండి. వీటిని బల్లులు వచ్చే చోట పెట్టండి చాలు. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు.