piles: ఏం చేసినా పైల్స్ తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి..
piles: పైల్స్ నొప్పి గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో. ఈ నొప్పిని ఇతరకులకు చెప్పుకోలేక.. తమలో తామే కుమిలిపోయే వారు చాలా మందే ఉన్నారు. అయితే కొన్ని హోం రెమిడీస్ తో వీటిని నయం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..

ఈ రోజుల్లో హేమోరాయిడ్స్ ( piles)చాలా సాధారణ సమస్యగా మారింది. కానీ ఇది భరించలేని నొప్పిని కలిగిస్తుంది. పైల్స్ రెండు రకాలు. మొదటిది.. దీనిలో పురీషనాళం నుండి రక్తం (Blood) బయటకు వస్తుంది. రెండోది.. ఇవి పురీషనాళం చుట్టూ దురద, నొప్పిని కలిగిస్తుంది. ఇవి పాయువు లోపల, బయట ఉబ్బుతాయి. దీనితో పాటు మొలలు బయటకు పొడుచుకు వస్తాయి.
piles
హేమోరాయిడ్స్ (Hemorrhoids) తో బాధపడుతున్న వ్యక్తులు సరిగ్గా కూర్చోలేరు. కూర్చుంటే విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే అది మరింత ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది ఈ సమస్య బారిన పడినా.. ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోరు. అసలు ఈ సమస్య గురించి మాట్లాడటానికే సిగ్గు పడతారు. అయితే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి సిగ్గుగా భావిస్తే .. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద.. పైల్స్ పై కలబంద గుజ్జును అప్లై చేయడం వల్ల నొప్పి, దురద రెండింటి నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆలివ్ ఆయిల్.. హేమోరాయిడ్స్ వాపు ఉన్నప్లేస్ లో ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే కాస్త రిలాక్స్ కూడా అనిపిస్తుంది.
జీలకర్ర.. జీలకర్రను బాగా నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పైల్స్ కు అప్లైం చేయాలి. దీంతో నొప్పి తక్షణమే తగ్గుతుంది. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
సొరకాయ.. సొరకాయను చిన్న చిన్నముక్కలుగా కట్ చేసుకుని అందులో కాస్త పసుపు, వేపనూనె ను వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీనిని పైల్స్ మీద అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే పైల్స్ తగ్గుతాయి.
నిమ్మరసం.. నిమ్మరసంలో కాస్త అల్లం, తేనెను బాగా మిక్స్ చేసి తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పైల్స్ నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ఇది శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది.
కొబ్బరి నూనె.. పైల్స్ కు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చికాకు, వాపు తగ్గుతుంది. దీంతోపాటుగా ఒక గ్లాసు మసాలా మజ్జిగలో పావు వంతు అజ్వైన్ పొడిని కలపండి. దీనిని భోజనం తర్వాత తాగితే పైల్స్ బాధనుంచి ఉపశమనం లభిస్తుంది.
ఐస్ క్యూబ్స్.. కొన్నిఐస్ క్యూబ్స్ ను తీసుకుని వాటిని ఒక గుడ్డలో చుట్టి, పురీషనాళంపై ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పెట్టండి. ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను ఫాలో అయితే పైల్స్ తొందరగా తగ్గుతాయి.