- Home
- Life
- High cholesterol: మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే సంకేతాలివే.. వీటిని అస్సలు లైట్ తీసుకోకండి..
High cholesterol: మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే సంకేతాలివే.. వీటిని అస్సలు లైట్ తీసుకోకండి..
High cholesterol warning Signs: ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య వల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే ఇది పెరగకుండా జాగ్రత్త పడాలి. అయితే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిందని ఈ సంకేతాలే చెప్తాయి.

High Cholesterol
High cholesterol: ప్రస్తుత కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువైంది. ఇలా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి గల ప్రధాన కారణాల్లో మన జీవనశైలి ఒకటి. మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. గుండెజబ్బులు, కొరోనరీ డిసీజ్ మరియు స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడే అవకాశం ఉంది. అయితే ఇది ఎలాంటి ముందస్తు లక్షణాలను కనబర్చదు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ గా పిలుస్తారు.
High Cholesterol
అయితే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కానీ జనాలు వీటిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. ఇవి ఏ సమస్య వల్ల వచ్చినయి అని తెలుసుకోరు. అందుకే చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో గుండెపోటు, హైబీపీ వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. మరి ఈ అధిక కొలెస్ట్రాల్ ను ఎలా గుర్తించాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
ఛాతి నొప్పి.. మీ ఛాతిలో తరచుగా నొప్పి వస్తోందా? అయితే ఇది అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం కావొచ్చు. ఇలా జరిగినప్పుడు లైట్ తీసుకోకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. లేదంటే కొలెస్ట్రాల్ మరింత పెరిగే అవకాశం ఉంది.
బాగా అలసిపోతారు.. బిజీ లైఫ్, పని ఒత్తిడి వల్ల బాగా అలసిపోతారని అందరికీ తెలుసు. కానీ అన్ని సార్లూ ఇలా జరగదు. ఏ పనిచేయకపోయినా మీరు అలసిపోతుంటే దాన్ని తేలిగ్గా తీసిపారేయకండి. అలాగే ఎప్పుడూ మీరు అలసిపోతుంటే అది అధిక కొలెస్ట్రాల్ సమస్యకు సంకేతం కావొచ్చు. ఇలాంటప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
మెడ నొప్పి.. గంటల తరబడి అంటే 9 నుంచి 12 గంటలు పనిచేస్తే పక్కాగా మెడనొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది. అలాగే పనిచేసినా చేయకపోయినా మెడ నొప్పి కలుగుతుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం. ప్రాణాంతకం కూడా.
చేతులు, పాదాల తిమ్మిరి.. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల చేతులు, కాళ్లు మొద్దుబారుతుంటాయి. కొంతమంది ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ ఇది మీ ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
back pain
వెన్ను నొప్పి.. మారుతున్న జీవన శైలి కారణంగా వెన్నునొప్పి రావడం సర్వ సాధారణం. పోషక లేమి ఆహారం తీసుకోవడం వల్ల కూడా యువత ఈ సమస్య బారిన పడుతున్నారు. కానీ ఈ సమస్య ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కూడా కనిపిస్తుంది.