మధుమేహులకు స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇలా చేయండి..
డయాబెటీస్ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ.. కొన్ని చిట్కాలను పాటిస్తే మీ గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో స్ట్రోక్ ముప్పు తప్పుతుంది.

డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో డయాబెటీస్ ఉన్నవారికి ఇతరులతో పోల్చితే గుండె జబ్బులు చాలా చిన్నవయసులోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి డయాబెటీస్ పేషెంట్లకు స్ట్రోక్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందట.
stroke
బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఎన్నో కారకాలుంటాయి. అయితే దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నప్పటికీ.. స్ట్రోక్ ప్రమాదం తగ్గాలంటే మాత్రం మధుమేహులు జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. మెదడుకు చేరే రక్త సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు స్ట్రోక్ వస్తుంది. అంటే మెదడు కణాలు నశించడం లేదా మెదడు కణజాలం దెబ్బతింటుందన్న మాట.
అయితే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లలో క్లోమం ఇన్సులిన్ ను తయారుచేయదు. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లలో ఈ క్లోమం చాలా తక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. లేదా కాలెయం, కండరాలు కొవ్వు, ఇన్సునిల్ ను సరైన మార్గంలో ఉపయోగించవు. దీనివల్ల.. చికిత్స తీసుకోని మధుమేహుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. అలాగే వారి కణాలకు తగినంత శక్తి అందదు. దీనివల్ల రానురాను రక్తంలో గ్లూకోజ్ పెరిగి రక్తనాళాల్లో కొవ్వు నిల్వలుగా మారి పెరిగిపోతాయి.
stroke
మధుమేహులకు స్ట్రోక్ ముప్పు తప్పాలంటే ఏం చేయాలి?
హెచ్బీఏ1సీ పరీక్ష: మూడు నెలల కాలంలో మీ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఈ టెస్ట్ చూపిస్తుంది. ఈ టెస్ట్ ను మధుమేహులు సంవత్సరానికి రెండు నుంచి నాలుగు సార్లు చేయించుకోవాలి. ముఖ్యంగా దీనిని 7 శాతం కాంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.
మధుమేహులకు స్ట్రోక్ ముప్పు తప్పాలంటే ఏం చేయాలి?
హెచ్బీఏ1సీ పరీక్ష: మూడు నెలల కాలంలో మీ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఈ టెస్ట్ చూపిస్తుంది. ఈ టెస్ట్ ను మధుమేహులు సంవత్సరానికి రెండు నుంచి నాలుగు సార్లు చేయించుకోవాలి. ముఖ్యంగా దీనిని 7 శాతం కాంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.
blood pressure
రక్తపోటు: డయాబెటీస్ పేషెంట్ల శరీరంలో రక్తపోటు పెరగకుండా చూసుకోవాలి. వీరిలో 140/90mm Hg కంటే తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
cholesterol
కొలెస్ట్రాల్: తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ నే ‘చెడు కొలెస్ట్రాల్’అని కూడా అంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలో కొలెస్ట్రాల్ 150 మి.గ్రా / డిఎల్ నుంచి 100 మి.గ్రా / డిఎల్ ఉండాలి అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డయాబెటీస్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. అందుకే కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలను అసలే తినకూడదు.
స్మోకింగ్ చేయొద్దు: స్మోకింగ్ వల్ల డయాబెటీస్ రానప్పటికీ.. గుండె జబ్బులు, స్ట్రోకక్ వచ్చే ప్రమాదం మాత్రం ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ మానేయడం వల్ల మీ రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. అలాగే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే శారీరకంగా చురుగ్గా ఉంటారు.
healthy food
ఆరోగ్యకరమైన ఆహారం: ప్రతిరోజూ మీరు 1,000 కేలరీలకు కనీసం 14 గ్రాముల ఫైబర్ ను తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తినాలి. కొలెస్ట్రాల్ ను రోజుకు 300 మిల్లీ గ్రాములకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.