High Blood Pressure Control Tips: బీపీ వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి..
High Blood Pressure Control Tips: రక్తపోటు దారుణంగా పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజుల్లో అధిక రక్తపోటు (High Blood Pressure ) సర్వసాధారణ సమస్యగా మారింది. కానీ ఈ సమస్య వల్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ముఖ్యంగా దీనివల్ల హార్ట్ ఎటాక్ (Heart attack) బారిన పడాల్సి వస్తుంది. అందుకే బీపీని ఎల్లప్పుడూ నియంత్రించుకోవాలి. మెరుగైన జీవన శైలితో కూడా హైబీపీకి చెక్ పెట్టొచ్చు.
high blood pressure
చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం (exercise)చేయపోవడం వంటి రకరకాల కారణాల వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అయితే కొన్ని సింపుల్ టిప్ప్ తో ఈ బీపీని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సోడియం తక్కువగా తీసుకోవాలి
అధిక రక్తపోటు సమస్య సోడియాన్ని (Sodium) ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వస్తుంది. అందుకే సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినకూడదు. లేకపోతే బీపీ ఎక్కువై అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పొటాషియం ఎక్కువగా తీసుకోవాలి
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి పొటాషియం (Potassium)ఎక్కువగా ఉండే ఆహారాలు మంచివి. వీటిని తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను వీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
వ్యాయామం రెగ్యులర్ గా చేయాలి
వ్యాయామం (exercise) ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ (Fit)గా ఉంటారు. ఇక బీపీ పేషెంట్లు కూడా చిన్న పాటి వ్యాయామాలను రెగ్యులర్ గా చేస్తే బీపీ నియంత్రణలో ఉంటుంది.
స్మోకింగ్ చేయకూడదు
స్మోకింగ్ (Smoking)ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి అందరికీ తెలుసు.. అయినా దీన్ని తాగడం మాత్రం మానేయరు. స్మోకింగ్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది. అంతేకాదు దీనివల్ల బీపీ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ అలవాటును మానుకుంటేనే బీపీ తగ్గుతుంది. లేదంటే తిప్పలు పడాల్సి వస్తుంది.
మెగ్నీషియం
మెగ్నీషియం (Magnesium)ఎక్కువగా లభించే ఆహారాలను తింటే కూడా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ విషయాలన్ని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. అరటి పండ్లు (Bananas), చిక్కుళ్లు, ఆకుకూరలు, డార్క్ చాక్లెట్ (Dark chocolate), బ్రౌన్ బ్రెడ్ వంటి ఆహారాలు రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.