బట్టలకు అంటుకున్న పీరియడ్స్ మరకలను సులువుగా పోగొట్టే చిట్కాలు ఇవిగో..
అమ్మాయిలకు ప్రతి నెలా పీరియడ్స్ (Periods)రావడం సర్వ సాధారణ విషయం. నెలలోని ఆ 5 రోజులు వారికి ఎంతో కష్టంగా గడుస్తాయి. అంతేకాదు ఈ సమయంలో వారి బట్టలకు లేదా బెడ్ షీట్లకు పీరియడ్స్ మరకలు కూడా అంటొచ్చు. కానీ వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ మరకలను ఎంత శుభ్రం (Clean)చేసిన కానీ.. పసుపు పచ్చగానే కనిపిస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ మరకలను సులువుగా వదిలించుకోవచ్చు. అవేంటంటే..

చల్లని నీళ్లు (Cold water): పీరియడ్ మరకలను పొగొట్టడానికి చాలా మంది వేడినీళ్ల (Boiling water)ను ఉపయోగిస్తుంటారు. నిజానికి పీరియడ్స్ మరకలను వేడి నీళ్లకంటే చల్లనీళ్లే తొందరగా పోగొడుతాయి. డ్రెస్ కు గానీ, బెడ్ షీట్ కు గాని పీరియడ్ మరకలు (Period stains) అంటినప్పుడు కూల్ వాటర్ ను వాష్ చేయడానికి ఉపయోగించండి.
వెనిగర్ (Vinegar): వెనిగర్ ఒక గొప్ప stain రిమూవర్ గా పనిచేస్తుంది. పీరియడ్స్ మరకలను పూర్తిగా తొలగించడానికి దీనిని ఉపయోగించవచ్చు. దీనికోసం వెనిగర్ ను మరకపై వేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే ఉండనివ్వండి. తడి గుడ్డతో మరకపై సున్నితంగా రుద్దండి. అలాగే మళ్లీ ఇంకోసారి మరకలపై వెనిగర్ ను వేసి.. క్లీన్ చేయండి.
నిమ్మరసం (Lemon juice): పీరియడ్ మరకలను తొలగించడానికి నిమ్మరసం కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం.. మరకపై తాజా నిమ్మరసాన్ని పిండండి. దానిని ఐదు నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత మీ చేతులతో తేలికగా రుద్దండి. దాన్ని చల్లటి నీటితో కడగండి.
ఉప్పు (Salt): ముదురు దుస్తుల (Dark dress)కు అంటిన పీరియడ్స్ మరకలను వదిలించడానికి రెగ్యులర్ గా వాడే సాల్ట్ ను ఉపయోగించొచ్చు. దీనికోసం నీరు 1/3 ఉప్పు కలిపిన మిశ్రమాన్ని తయారు చేసి అందులో మరకలు పడిన బట్టలను నానబెట్టాలి. ఆ తర్వాత దానిని బ్రష్ తో క్లీన్ చేయండి.
బేకింగ్ సోడా (Baking soda): పీరియడ్స్ మరకలను బేకింగ్ సోడా కూడా సులువుగా వదిలిస్తుంది. ఇందుకోసం బేకింగ్ సోడాను తీసుకుని చల్లటి నీటితో మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మరకలపై అప్లై చేసి, సున్నితంగా రుద్దాలి. దీనిని కనీసం ౩౦ నిమిషాలైనా అలాగే ఉంచండి. ఆ తర్వాత దీనిని సాధారణ సర్ఫ్ తో కడగండి.
స్టెయిన్ రిమూవర్ (Stain remover): క్లోరాక్స్ (Chlorox) నుంచి ఆక్సిక్లిన్ (Oxyclin)వరకు మార్కెట్ లో ఇటువంటి స్టెయిన్ రిమూవర్ లు అనేకం ఉంటాయి. ఇవి పీరియడ్స్ మరకలను సులువుగా తొలగించగలవు. ఇందుకోసం మరకలు అంటిన బట్టలను స్టెయిన్ రిమూవర్ లో 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తరువాత చల్లని నీటిలో కడగండి. ఇది కాకుండా మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కూడా ప్రయత్నించవచ్చు. దీని కోసం మరకపై హైడ్రోజన్ పెరాక్సైడ్ ను అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగేయండి.