అందానికి కొబ్బరి నీళ్లు.. ఎలా ఉపయోగించాలంటే?
పోషకాలు పుష్కలంగా ఉంటే కొబ్బరి నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు కొబ్బరి నీరు మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. మచ్చలేని, ప్రకాశవంతమైన చర్మం కోసం దీన్నిఎలా ఉపయోగించాలంటే?

coconut water
నేచురల్ ఎంజైమ్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే కొబ్బరి నీరు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్ మన శరీర సమతుల్యతను కాపాడుతుంది. అలాగే చర్మం పై మచ్చలను పోగొతుంది. బహుళ చక్కెరలు,అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండే కొబ్బరి నీరు చర్మాన్ని తేమగా ఉంచడానికి, పోషించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే కొబ్బరి నీరు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే వృద్ధాప్య సంకేతాల నుంచి కూడా రక్షిస్తుంది. ఇందుకోసం కొబ్బరి నీళ్లను ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
coconut water
మొటిమల సమస్య నుంచి ఉపశమనం
దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీర చర్మంపై మొటిమల సమస్యను దూరం చేస్తాయి. కొబ్బరినీళ్లు తాగడంతో పాటు చర్మాన్ని శుభ్ర చేసుకోవడం వల్ల చర్మంలో ఉండే దుమ్ము రేణువులు, అదనపు నూనె సమస్య తొలగిపోతుంది. కొబ్బరి నీరు పొటాషియానికి మంచి మూలం. ఈ కొబ్బరి నీటిని రోజూ తాగితే శరీరంలో నీటి కొరత ఉండదు.
ఎలా అప్లై చేయాలి
కొబ్బరి నీటిని ముఖానికి అప్లై చేయడానికి ముందు.. రెండు టీస్పూన్ల కొబ్బరి నీటిలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి కాటన్ తో మొటిమలపై అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం శుభ్రపడటమ కాదు మళ్లీ మొటిమలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
skin care
చర్మశుద్ధి
యూవీ కిరణాలు ముఖ చర్మానికి హాని కలిగిస్తాయి. కొబ్బరిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మంలో తేమను ఉంచుతుంది. అలాగే టోన్ సమస్యను పరిష్కరించే కణాలను రిపేర్ చేస్తుంది.
ఎలా అప్లై చేయాలి
దీన్ని ముఖానికి అప్లై చేయాలంటే.. ముల్తానీ మట్టిలో కొబ్బరి నీళ్లను కలపండి. ఇప్పుడు దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. అది ఆరిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఇది ముఖం రంగును మెరుగుపరచడమే కాకుండా చర్మ కణాలను పునర్నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. ముల్తానీ మట్టి పేస్ట్ తీసివేసిన తర్వాత కాటన్ సహాయంతో కొబ్బరి నీళ్లను ముఖానికి అప్లై చేయండి.
healthy skin
చర్మాన్ని ప్రకాశవంతంగా ..
ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ మన గట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీరు శరీరంలోని జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో ఎసిడిటీ సమస్య పోతుంది. ఇది పిహెచ్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. శరీరంలోని జీర్ణవ్యవస్థ కారణంగా చర్మంపై దాని ప్రభావం కనిపిస్తుంది.
ఎలా అప్లై చేయాలి?
ముఖం కాంతిని కాపాడుకోవాలంటే కొబ్బరి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. నిజానికి ఎండాకాలంలో చెమటలు పట్టడం వల్ల చర్మం తాజాగా కనిపించదు. దీనివల్ల చర్మం కాంతి క్రమంగా తగ్గుతుంది. చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే గంధం పొడిలో కొబ్బరినీళ్లు మిక్స్ చేసి బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖాన్ని చల్లబరచడమే కాకుండా ముఖ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
healthy skin
యాంటీ ఏజింగ్ లక్షణాలు
కొబ్బరి నీళ్లలో హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. చల్లని కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీర ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో ముఖంపై వయసుకు ముందే కనిపించే వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.
ఎలా అప్లై చేయాలి?
రెండు టీస్పూన్ల కొబ్బరి నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై వయసుకు ముందే కనిపించే సన్నని గీతలు తగ్గుతాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.