బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే గుండె జబ్బులొస్తాయంట జాగ్రత్త..
Heart Attack Risk: సరిగ్గా బ్రష్ చేయడానికి బద్దకమైతే.. మీరు పక్కాగా గుండె జబ్బుల పాలవుతారనే విషయం మీకు ఎరుకేనా.. అవును వినడానికి వింతగా ఉన్నా ఈ విషయం ముమ్మాటికీ నిజమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Heart Attack Risk: జ్వరం తో మనం హాస్పటల్లకు వెళ్లినప్పుడు డాక్టర్ ముందుగా చూసేది మన నాలుకనే. ఎందుకో తెలుసా.. నోటిని ఎంత క్లీన్ గా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. మౌత్ పరిశుభ్రంగా లేకపోతేనే సర్వరోగాలు చుట్టుకే ప్రమాదం ఉంది. అందుకే హాస్పటల్లకు వెళ్లినప్పుడు డాక్టర్లు ముందుగా మన నోటిని చూస్తుంటారు.
అయితే ఉదయం పూట నోటినీ, పళ్లను సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే గుండె జబ్బులు వస్తాయని నిపుణులు ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.
అవును ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. నోటిని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ప్రమాదకరమైన నోటి క్యాన్సర్ , దంతక్షయం వంటి సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. నోటిని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తయో తెలుసుకుందాం పదండి.
గుండె సమస్యలొస్తయ్.. మన నోటిలో బ్యాక్టీరియా లక్షల్లో నివసిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో హానీ కలిగిస్తుంది. అందుకు డాక్టర్లు నోటిని సరిగ్గా క్లీన్ చేసుకోమనేది.
నోటిని సరిగ్గా క్లీన్ చేసుకుంటేనే ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా బయటకు వెళిపోతుంది. అయితే కొంతమంది మాత్రం ఆత్రం ఆత్రంగా నోటిని క్లీన్ చేశామా అంటే చేశాము అనిపిస్తూ ఉంటారు. దీనివల్ల వాల్ల నోటిలో బ్యాక్టీరియా అంతా అలాగే ఉంటుంది. దీనివల్ల వారికి కొద్దికాలంలోనే గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తేల్చుతున్నారు.
సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా గుండెకు చేరుకుంటుంది. దీంతో గుండె ప్రమాదంలో పడుతుంది.
పరిశుభ్రత ఎంతో అవసరం.. ప్రతి రోజూ సరిగ్గా బ్రష్ చేయడానికి సమయాన్ని కేటాయించాలి. ఒక పద్దతి ప్రకారమే బ్రష్ చేయాలి. ఇలా చేస్తేనే నోరు పరిశుభ్రంగా ఉంటుంది. చిగుళ్లకు సంబంధించిన రోగాలు కూడా వచ్చే అవకాశం ఉండదు.
టూత్ బ్రెష్ పై పేస్ట్ ను పెట్టి దాన్ని చిగుళ్ల నుంచి 45 డిగ్రీల కోణంలో పెట్టాలి. తర్వాత బ్రష్ ను దంతాలపై ముందుకు వెనకకు కదిలిస్తూ తోమాలి. ఇలా చేసిన తర్వాత Tooth surface లోపు కూడా క్లీన్ చేయాలి. బ్రష్ చేయడం అయిపోయాక నాలుకను సరిగ్గా శుభ్రం చేయాలి. ఇలా చేస్తేనే మీ నోరు క్లీన్ గా ఉంటుంది. దీంతో మీకు ఎలాంటి రోగాలు సోకే ప్రమాదం కూడా ఉండదు.