ఈ వ్యాధి వల్లే అర్థరాత్రి నిద్రలేస్తారా?
అర్థరాత్రి ఎప్పుడో ఒకసారి మెలుకువ రావడం సర్వ సాధారణం. కానీ కొద్ది సపటి తర్వాత మళ్లీ నిద్రొస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఒక్కసారి నిద్రలేచిన తర్వాత అస్సలు నిద్రపోరు. ఇది ఒక ప్రమాదరకరమైన వ్యాధికి సంకేతమని నిపుణులు అంటున్నారు.
చాలా మందికి అర్థరాత్రి 12 గంటల కంటే ముందే నిద్రపోయే అలవాటుంటుంది. అయితే అర్థరాత్రి దాహం వేయడం, టాయిలెట్ వంటి కారణాల వల్ల మెలుకువ వస్తుంటుంది. ఇక కొంతమందికి ఏ కారణం లేకుండానే నిద్రలేస్తారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ పడుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఒక్కసారి నిద్రలేచిన తర్వాత అస్సలు నిద్రరాదు. దీనికి కారణం అనారోగ్య సమస్యే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నిద్ర మధ్యలో మేల్కొని.. ఆ తర్వాత నిద్రపోలేకపోతే ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇవి మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి కావచ్చు. లేదా శారీరక ఆరోగ్యానికి సంబంధించినవీ కావొచ్చు.
అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల మధ్యన మీ నిద్రకు అంతరాయం కలిగితే అది కాలేయ సమస్యలకు సంకేతమని అధ్యయనాలు చెబుతున్నాయి.
liver
మన శరీరానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, ఏదైనా శారీరక శ్రమ, సాయంత్రం డిన్నర్, నిద్ర ఇలా ప్రతిదానికీ సమయానికి అనుగుణంగా మన శరీరం పనిచేస్తుంది. దీని ప్రకారం.. మనం రాత్రి నిద్రపోయినప్పుడు మన కాలేయం ఎక్కువగా పనిచేస్తుంది. కాలేయం ప్రధాన పని శరీరం నుంచి అనవసరమైన పదార్థాలను బయటకు పంపి.. శరీరాన్ని శుభ్రపరుస్తుంది.
కానీ కాలేయ సమస్యలు ఉన్నవారిలో ఈ కార్యకలాపాలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీంతో నాడీ వ్యవస్థ మేల్కొంటుంది. దీంతో నిద్ర సమస్యలు వస్తాయి.
కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారిలో 60 నుంచి 80 శాతం మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. నిద్ర లేకపోవడం (నిద్రలేమి), తక్కువగా నిద్ర రావడం, పగటిపూట నిద్రపోవడం వంటివి కాలేయ వ్యాధికి సంబంధించిన కొన్ని లక్షణాలు. మీకున్నది కాలెయ సమస్యా? కాదా? అనేది వైద్య పరీక్షలు చేయించుకుంటే బయటపడుతుంది. ఎందుకంటే దీని ద్వారా మాత్రమే వ్యాధిని నిర్ధారించవచ్చు.
కాలేయ సిరోసిస్ వ్యాధిలో అర్థరాత్రి నిద్రమేల్కోవడం సాధారణ విషయం. ఈ వ్యాధి బలహీనమైన జీవన నాణ్యతతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యాధిలో అత్యంత సాధారణ సమస్య నిద్రలేమి (నిద్రపోవడం, నిద్రపోవడంలో ఇబ్బందులు, లేదా అటు తిరిగి ఇటు తిరిగి నిద్రపోకపోవడం). అలాగే పగటిపూట నిద్ర ఎక్కువగా పోతారు. సిరోసిస్ వ్యాధిలో మెలటోనిన్, గ్లూకోజ్ జీవక్రియకు అంతరాయం కలిగిస్తాయి.
లివర్ సిరోసిస్ అనేది ఒక సాధారణ ప్రాణాంతక హెపాటిక్ డిజార్డర్. సిరోసిస్ కు ప్రధాన కారణాలు హానికరమైన మద్యపానం, వైరల్ హెపటైటిస్ బి, సి, జీవక్రియ రుగ్మతలు, ఆల్కహాలిక్ కాని కొవ్వు.. కాలేయ వ్యాధికి సంబంధించినవి.