Health Tips: జీర్ణవ్యస్థను ఆరోగ్యంగా ఉంచే హెల్తీ ఫుడ్స్ ఇవే.. !
Health Tips: జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు బచ్చలికూర, గోధుమలు, బ్లూబెర్రీస్, చేపనూనె, ఓట్స్, పండ్లు ఎంతో సహాయపడతాయి.

Health Tips: జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసినప్పుడే మనం అన్ని విధాల ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మనం కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే అజీర్థి, కడుపు నిండుగా అనిపించడం, వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇది ఆరోగ్యంగా ఉండేందుకు మనం కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమలు.. గోధుమల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని తరచుగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
బచ్చలి కూర.. బచ్చలి కూరలో కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఈ బచ్చలి కూర చాలా తొందరగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా వీటివల్ల శరీరంలోకి అదనపు కొవ్వులు చేరే అవకాశమే ఉండదు. గర్భిణులు ఈ బచ్చలి కూరను తింటే ఎన్నో పోషకాలు లభిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది చక్కటి ఔషదంలా పనిచేస్తుంది.
బ్లూబెర్రీస్.. ఈ బ్లూబెర్రీస్ లల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సహాపడతాయి. అంతేకాదు ఇవి అజీర్థి సమస్యలను కూడా తొలగిస్తాయి. ఇతర ఆహారాలను తొందరగా జీర్ణం చేసేందుకు కూడా ఎంతో సహాయపడతాయి. క్యాన్సర్ ను కూడా అడ్డుకోగలవు.
చేపనూనె.. చేప నూనెలో విటమిన్ ఎ, విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ చేపనూనె పేగులను హెల్తీగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. జీర్ణసంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అజీర్థి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పండ్లు.. సిట్రస్ పండ్లు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. స్టమక్ ఇన్ఫెక్షన్ ను కూడా తగ్గిస్తుంది. ఈ సిట్రస్ పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే నీరసం, అలసట వంటి సమస్యలు మీ దరిచేరవు.
పెరుగు.. పెరుగు ఎన్నో రకాల అనారోగ్య సమస్యకు చెక్ పెడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. పెరుగులో ఉండే గుణాలు పొట్టకు సంబంధించిన రోగాలను ఎట్టే నయం చేయగలదు.
ఓట్స్.. ఓట్స్ లో విటమిన్స్, మినరల్స్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవన్నీ జీర్ఱక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ ఓట్స్ మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తుంది. పొట్ట ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.