గర్భిణిలూ నవరాత్రి ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి..
నవరాత్రి సందర్భంగా చాలా మంది ఆడవారు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు. గర్భిణులు కూడా ఉపవాసం ఉంటుంటారు. ఇలాంటి వాళ్లు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం మర్చిపోకూడదు.
నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు నిష్టగా పూజలు చేస్తూ ఉపవాసం ఉంటారు చాలా మంది. ఈ ఉపవాసం ఉంటున్న వారు రెగ్యులర్ ఫుడ్ కు దూరంగా ఉంటారు. ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు ముఖ్యంగా గర్భిణులు ఉండకపోవడమే మంచిది. ఒకవేళ గర్భిణులు ఉపవాసం ఉంటే మాత్రం కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం పదండి.
గర్భంతో ఉన్నప్పుడు తరచుగా తింటూ ఉండాలి. ఇక ఉపవాస సమయంలో ఏవి తినరు. కాబట్టి మీరు ఎక్కువ సేపు ఉపవాసం ఉండకండి. అలా ఉంటే మీ బిడ్డ ఎదుగుదలపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సమయంలో మీరు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, జింక్, విటమిన్ బి9, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఫుడ్స్ ను తీసుకోవాలి.
కొబ్బరి నీళ్లు
గర్భిణుల శరీరంలో ఎప్పుడూ తేమగా ఉండాలి. ఇలా ఉండాలంటే నీళ్లను, కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగాలి. అప్పుడే మీ శరీరంలో హైడ్రేట్ గా ఉంటుంది. దీంతో మీ బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
తృణధాన్యాలు
తృణధాన్యాలు హెల్తీ ఫుడ్. వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మినుములు, రాగి, రాజగిరా, సగ్గుబియ్యం వంటి వాటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని గర్భిణులు తప్పకుండా తినాలి.
నట్స్
నట్స్ లో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో బాదం, వాల్ నట్స్, పిస్తా, వేరు శెనగ, కిస్ మిస్ వంటి నట్స్ ను తప్పకుండా తినండి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటితో పాటుగా పాలు, పండ్లను కూడా తీసుకోండి. ఇవి మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. మీ బిడ్డను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
పిండి పదార్థాలు
ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి కార్భోహైడ్రేట్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి కండరాల్ల బలాన్ని పెంచుతాయి. బయటివి కాకుండా ఇంట్లేనే పూరీలు లేదా పకోడీలో లేకపోతే తృణధాన్యాలతో రొట్టెలు చేసుకుని తినండి. గుప్పెడు పల్లీలను పెనం పై నూనె లేకుండా వేయించి తిన్నా మీకు ఎనర్జీ వస్తుంది.
పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయల్లో రకరకాల పోషకాలుంటాయి. పండ్లను తినడం బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. వీటిని సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది. ఇక కూరగాయలను ఫ్రై చేయకుండా ఉడికించి తినాలి. అప్పుడే వాటిలో పోషకాలు మీకు అందుతాయి. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు ప్యాక్ చేసిన ఫుడ్ ను తినకూడదు. కెఫిన్ ఉండే టీ, కాఫీలను అసలే తాగకండి.
పాలు
పాలలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే గర్భిణులు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువుంటే పాలను అస్సలు తాగకూడదు. వీటిని తాగితే నిద్రమత్తుగా ఉంటుంది.
సూపులు
ఉపవాసం ఉండే గర్భిణులు తొందరగా నీరసించి పోతారు. ఒంట్లో శక్తి కూడా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో మీకు కూరగాయల సూప్ లు ఎంతో మంచివి. వీటి ద్వారా మీ బాడీ ఎనర్జీటిక్ గా, హైడ్రేట్ గా ఉంటుంది. మీ బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మర్చిపోకండి.