నెలసరి సమయంలో ఆ సమస్యలు రాకూడదంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే..
Women’s Health Tips: నెలసరి సమయంలో చాలా మంది మహిళలు హెల్త్ పరంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కడుపు నొప్పి, బాడీ పెయిన్, వికారం, వాంతులు, వెన్ను నొప్పి, అలసట వంటి అనేక అనారోగ్య సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ ను ఫాలో అయితే చాలు.

Women’s Health Tips: నెలసరి సమయంలో మహిళలందరి పరిస్థితి ఒకేలా ఉండదు. కొంతమంది ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు జరగవు. కానీ ఇంకొంతమంది మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో కడుపు నొప్పి, బాడీ పెయిన్స్, వికారం, వాంతులు, అలసట, చికాకు, వెన్ను నొప్పి వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీనికి కారణం ఆ సమయంలో హర్మోన్ల అసమతుల్యత, పోషకలేమి ఆహారం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.
ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు వారు తినే ఆహారంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నెలసరి (Periods) టైంలో ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడదు.
పీరియడ్స్ టైంలో తాజా పండ్లను ఎక్కువగా తినాలి. శరీరానికి సరిపడా నీళ్లను తాగుతూ ఉండాలి. ఓట్ మీల్ ను, అల్లం తో కూడిన ఆహారాలను ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటుగా ఇతర ఆహారాలను చేర్చుకుంటే కూడా నెలసరి నొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు. అవేంటంటే..
పండ్లు: నెలసరి సమయంలో నీటి శాతం ఎక్కువగా ఉండే తాజా పండ్లను తినడం ద్వారా కూడా నెలసరి నొప్పి, అలసటకు చెక్ పెట్టొచ్చు. పుచ్చకాయ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండును తినండి.
అల్లం: అల్లంలో Anti-inflammatory లక్షణాలు ఉన్నందున వీటిని నెలసరి సమయంలో తీసుకుంటే కండరాల నొప్పి తగ్గుతుంది. అంతేకాదు వాంతులు, వికారం వంటి సమస్యలను కూడా అల్లం తగ్గిస్తుంది. అలా అని ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకోకూడదు. మోతాదులోనే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
నీళ్లు: చాలా మంది మహిళలు నెలసరి సమయంలో నీళ్లను మొత్తానికే తాగరు. ఇలా చేస్తే బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీనివల్ల తలనొప్పి వస్తుంది. అంతేకాదు కడుపు ఉబ్బరం సమస్య కూడా అటాక్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకూడదంటే పీరియడ్స్ టైం లో ఎక్కువ నీళ్లను తాగుతూ ఉండండి.
ఆకు కూరలు: నెలసరి టైంలో చాలా మంది మహిళలకు ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో వారు బాడీ పెయిన్స్, అలసట, తలతిరగడం వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఐరన్ లోపాన్ని పోగొట్టడానికి ఆకు కూరలు బాగా ఉపయోగపడతాయి. ఆకు కూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెలసరి సమయంలో ఆకు కూరలను ఎక్కువగా తినండి.
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే ఐరన్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి నట్స్ ఎంతో సహాయపతాయి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ నెలసరి లక్షణాలను తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్ నెలసరి లో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి ఎంతో సహాయపడతాయి.