MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఉదయం లేవగానే పాదాలు నొప్పిగా ఉంటున్నాయా? అయితే మీకు ఆ సమస్య ఉన్నట్టే..

ఉదయం లేవగానే పాదాలు నొప్పిగా ఉంటున్నాయా? అయితే మీకు ఆ సమస్య ఉన్నట్టే..

కొంతమందికి ఉదయం నిద్రలేవగానే పాదాల్లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. నిజానికి ఉదయం పాదాల నొప్పికి కారణాలెన్నో ఉన్నాయి. అవేంటేంటే..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 25 2022, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఉదయం నిద్రలేవగానే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఎంతటి కష్టమైన పనినైనా ఇట్టే చేసేంత శక్తి ఉంటుంది. కానీ కొంతమందికి ఉదయం లేవగానే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో పాదాల నొప్పి ఒకటి.  పాదాలను నేలపై పెట్టగానే విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ పాదాల నొప్పి వల్ల రోజు వారి పనులను కూడా సరిగ్గా చేసుకోలేరు. అయితే ఈ పాదాల నొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. మీ పాదాలకు సరిపోని షూస్ ను వేసుకోవడం, పడుకునే పొజీషన్ సరిగ్గా లేకున్నా పాదాల నొప్పి కలుగుతుంది. అయితే ఉదయం పూట పాదాల నొప్పి కొన్ని కొన్ని సార్లు ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. మీ పాదాలలో విపరీతమైన నొప్పి కలిగితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

27

ఉదయం పూట మీ పాదాలను నేలపై పెట్టగానే విపరీతమైన కలగితే దానిని ప్లాంటార్ ఫాసిటిస్ అని చాలా మంది భావిస్తారు. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం.. దీర్ఘకాలిక మడమ నొప్పికి ఇది చాలా సాధారణ లక్షణం. అయితే పాదాల నొప్పికి మరిన్ని కారణాలు కూడా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

పాదాలు లేదా మడమలో నొప్పి మహిళల్లో ఒక సాధారణ సమస్య

సాధారణంగా పాదాలు, మడమల్లో నొప్పి ఆడవారు, మగవారిలో వస్తుంది. అయితే పాదాలు లేదా మడమలలో నొప్పి మహిళల్లో సర్వ సాధారణ సమస్య అంటున్నారు నిపుణులు. ఉందుకంటే మగవారితో పోల్చితే ఆడవారిలోనే విటమిన్ డి, కాల్షియం లోపం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాల లోపం వల్ల కూడా పాదాల్లో నొప్పి కలుగుతుంది. 
 

47
feet

feet

రుతువిరతికి చేరుకున్న మహిళల్లో..

రుతువిరతి వయస్సు వచ్చిన ఆడవారి శరీరంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఉదాహరణకు.. రుతువిరతికి చేరుకున్న మహిళల్లో.. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ఉదయం పాదాల్లో నొప్పి కలగడం సర్వ సాధారణం. ఎందుకంటే ఇలాంటి వారు ఎముకలను బలహీనపరిచే బోలు ఎముకల వ్యాధితో బాధపడే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 
 

57

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాదాలలో నొప్పి..

పాదాల్లో నొప్పికి వయస్సుతో సంబంధం అసలే లేదంటున్నారు నిపుణులు. అయినా ఈ రోజుల్లో  డయాబెటీస్ కూడా వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. చిన్న పిల్లల నుంచి యువకులు,  వృద్ధులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. మీరు మధుమేహులా? అయితే కూర్చున్నప్పుడు లేదా కదిలేటప్పుడు పాదాలు లేదా మడమలలో నొప్పి కలిగే ఛాన్స్ ఉంది. ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారు కూడా పాదాల్లో నొప్పితో బాధపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా వారాలు లేదా నెలల నుంచి ఈ సమస్యతో బాధపడుతుంటే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుంటే మంచిది.
 

67

పాదాల నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? 

ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యలుంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగించండి. ఫిజియోథెరపీ కూడా ఈ నొప్పులను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

 

77

మీ శరీరంలో విటమిన్ డి, కాల్షియం లోపం ఉంటే పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోండి. కొన్ని రకాల ఆహారాల్లో సహజంగా విటమిన్ డి 3 లో సమృద్ధిగా ఉంటుంది. ఫ్యాటీ చేపల మాంసం, చేపల కాలేయ నూనెలు వీటికి ఉత్తమ వనరులు, జున్ను, గుడ్డు సొన, గొడ్డు మాంసం కాలేయంలో కూడా ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని పుట్టగొడుగుల్లో విటమిన్ డి  కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.అందుకే సరైన ఆహార పదార్థాలను తినండి.  దీంతో మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Salt Water Bath: నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఇన్ని లాభాలా? అయితే చేయాల్సిందే
Recommended image2
Eggplant: కొంచెం స్థలంలోనే వంగ మొక్కల్ని ఇలా పెంచండి
Recommended image3
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved