MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పీరియడ్స్ కు ముందు జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోందా? అయితే అది ఆ సమస్యే..

పీరియడ్స్ కు ముందు జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోందా? అయితే అది ఆ సమస్యే..

పీరియడ్స్ ఫ్లూ  Premenstrual syndrome లో ఒక భాగం. ఇది కూడా ఫ్లూ లాంటి లక్షణాలనే కలిగుంటుంది. ఇలాంటి పరిస్థితిలో  కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 27 2022, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పీరియడ్స్ కు ముందు మీకు జ్వరమొచ్చిన లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు పీరియడ్ ఫ్లూ బారిన పడ్డారని అర్థం. తిమ్మిరి, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (పిఎంఎస్) లక్షణాలు. అయితే పీరియడ్ ఫ్లూ కూడా దీనిలో భాగమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.  ఇది మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పీరియడ్స్ కు ముందే కాదు.. కొన్నిసార్లు మీ పీరియడ్స్ సమయంలో  కూడా మీరు అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. మనలో చాలా మంది దీనిని అస్సలు గమనించరు. లేదంటే ఇది పీరియడ్ సమస్యలలో ఒకటిగా భావించి వదిలేస్తారు. కానీ ఇది కొన్ని కొన్ని సార్లు ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పీరియడ్ ఫ్లూ అంటే ఏమిటి?

ఈ పీరియడ్ ఫ్లూ పీరియడ్స్ కు ముందు వస్తుంది. ఇది ఫ్లూ లాంటి లక్షణాలను చూపెడుతుంది. ఇవి తేలికపాటి నుంచి తీవ్రమైనవిగా ఉండొచ్చు. ఇది ఇన్ఫ్లుఎంజా కానప్పటికీ.. మీ శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  కొంతమంది మహిళలు వారి పీరియడ్స్ ప్రారంభాన్ని సూచించే విభిన్న లక్షణాలను కలిగి ఉంటారు. . ఈ లక్షణాలు ఇన్ఫ్లుఎంజా లక్షణాలను పోలి ఉండొచ్చంటున్నారు నిపుణులు, కొన్నిసార్లు దీన్ని ఫ్లూ అని కూడా పిలుస్తారు. అయితే ఇది అంటువ్యాధి కాదు. దీని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. 
 

36

తలనొప్పి
జ్వరం
కండరాల నొప్పి
వెన్నునొప్పి
తిమ్మిరి
వికారం, వాంతులు
అలుపు
జీర్ణ సమస్యలు (మలబద్ధకం)
కీళ్లు లేదా కండరాల నొప్పులు

46

మానసిక స్థితిలో మార్పులు కూడా ఈ పీరియడ్ ఫ్లూ లక్షణమే. ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు అండోత్సర్గానికి ఒకటి లేదా రెండు వారాల ముందు నుంచే కనిపిస్తాయి. ఇక పీరియడ్స్ కు ముందు ఈ లక్షణాలు ఎక్కువ అవుతాయి. 
 

56

పీరియడ్ ఫ్లూ కు కారణాలు?

శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు మరీ తక్కువగా ఉన్నప్పుడు, అలాగే  ఋతు చక్రంలో సంభవించే ప్రొజెస్టెరాన్ స్థాయి పెరిగినప్పుడు హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. వీటివల్లే ఈ లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్ ఫ్లూ లక్షణాలు వివిధ రకాల సెక్స్ హార్మోన్లు, నిర్దిష్ట న్యూరోట్రాన్స్మిటర్లతో వాటి పరస్పర చర్యల వల్ల సంభవించవచ్చంటున్నారు నిపుణులు. పీరియడ్ ఫ్లూ 2 వారాల వరకు ఉంటుంది. సాధారణంగా ఇది అండోత్సర్గము తర్వాత ప్రారంభమవుతుంది.
 

66
periods

periods

పీరియడ్ ఫ్లూతో పోరాడటానికి చిట్కాలు

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు భోజనం చేయండి. 

హోల్ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్,  బీన్స్ వంటి తృణధాన్యాల ఉత్పత్తులనే తినండి. 

ఉప్పు, కెఫిన్, ఆల్కహాల్ వంటివి హార్మోన్ల మార్పులకు కారణమవుతాయి. అందుకే ఇలాంటి ఆహారాలను, పానీయాలను తక్కువగా తీసుకోండి. 

మీ ఆహారంలో  కాల్షియం ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది పిఎంఎస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

మంచి వ్యాయామం, హైడ్రేషన్ పీరియడ్స్ సమయంలో మీ శరీరం చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. 

విటమిన్ డి ని పొందడానికి సూర్యకాంతిలో కొద్ది సేపు ఉండండి. 

సంక్రమణతో పోరాడటానికి, పీరియడ్ ఫ్లూను తగ్గించుకోవడానికి, శరీర సామర్థ్యాన్ని పెంచడానికి విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Chain Earring: ఈ చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మహారాణిలా కనిపిస్తారు
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved