MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గుడ్డులోని తెల్లసొన మంచిదా? పచ్చసొన మంచిదా? ఇంతకీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైందంటే..?

గుడ్డులోని తెల్లసొన మంచిదా? పచ్చసొన మంచిదా? ఇంతకీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైందంటే..?

రోజుకో గుడ్డు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొంతమంది మాత్రం గుడ్డులోని తెల్లసొననో లేకపోతే పచ్చసొననో ఏదో ఒకదాన్ని మాత్రమే తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్డులోని తెల్లసొన మంచిదా? పచ్చసొన మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 19 2023, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరులు అన్న సంగతి మనందరికీ బాగా తెలుసు. దీనిలో  ఉండే పోషకాలు మనలో ఎన్నో పోషకాల లోపాలను పోగొడుతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అందుకే కనీసం రోజుకు ఒక ఉడుక బెట్టిన గుడ్డును ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన.. రెండూ ఆరోగ్య పరంగా ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి గుడ్డు పచ్చసొనలో అధిక కొవ్వు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అయితే తెల్ల సొనలో మాత్రం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిసి మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు మన శరీరానికి ఎంతో సహాయపడతాయి. కానీ కొంతమంది గుడ్డులోని తెల్లసొన లేదా పచ్చసొనలో ఏదో ఒకదాన్ని మాత్రమే తింటుంటారు. నిజానికి చాలా మంది తెల్లసొనను మాత్రమే ఎక్కువగా తింటారు. పచ్చసొన కంటే గుడ్డు తెల్లసొననే ఎందుకు ఎక్కువగా తింటారన్న దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

గుడ్లు ప్రోటీన్ల భాండాగారం. దీనిర్థం గుడ్లలో మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మన శరీరం వీటిని స్వయంగా తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారానే పొందాల్సి ఉంటుంది. ఇవి మన శరీరానికి చాలా అవసరం. 
 

35

గుడ్డులోని తెల్లసొన ప్రయోజనాలు

గుండె జబ్బులతో బాధపడేవారికి గుడ్డులోని తెల్లసొన ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రోటీన్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ తెల్లసొన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను ఏ మాత్రం పెంచదు. అంతేకాదు ఇది కండరాల రుగ్మతలను తగ్గిస్తుంది. కండర ద్రవ్యరాశి నిర్మాణానికి సహాయపడే ఎన్నో రకాల అమైనో ఆమ్లాలు ఈ తెల్లసొనలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వెయిట్ లాస్ కావాలనుకున్నవారు ఎక్కువగా తెల్ల సొననే తింటుంటారు. దీనిలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల ఇది బరువును పెంచే అవకాశం ఉండదు. 
 

45
<p>egg</p>

<p>egg</p>

గుడ్డులోని పచ్చసొన ప్రయోజనాలు

గుడ్డు పచ్చసొనలో కెరోటినాయిడ్లు, లుటిన్, జియాక్సంతిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లన్నీ కండరాల నిర్మాణానికి ఎంతగానో సహాయపడతాయి. శరీరంలో బయోటిన్ వంటి సమ్మేళనాలను ప్రోత్సహిస్తాయి కూడా. ఉండాల్సిన బరువు కంటే మరీ సన్నగా ఉన్నవారు లావు కావడానికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ ముఖం అందంగా మెరిసిపోవడానికి కూడా సహాయపడుతుంది. మన శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే లక్షణాలను తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
 

55

గుడ్డు పచ్చసొన లేదా గుడ్డులోని తెల్లసొన మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే మనలో చాలా మంది పచ్చసొనను ఆరోగ్యకరమైన ఆహారంగా చూడరు. ఇది చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుందని నమ్ముతారు. అందుకే చాలా మంది గుడ్డులోని పచ్చసొనను పారేస్తుంటారు. కేవలం తెల్లసొనను మాత్రమే తింటుంటారు. గుడ్డులోని తెల్లసొన భాగం బరువు తగ్గాలనుకునేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది, గుడ్డు పచ్చసొన శరీరానికి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మొత్తం గుడ్డు తినడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందుతాయి.రోజుకు ఒక మొత్తం గుడ్డును తిన్నంత మాత్రం బరువు పెరగరు. కొలెస్ట్రాల్ ఎంత మాత్రం పెరగదు. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచించినట్టుగా గుడ్డు మొత్తాన్ని తినండి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Recommended image2
Sarees: ఇలాంటి చీరలు కట్టారంటే ఎవరైనా చూస్తూ ఉండిపోతారు
Recommended image3
Chair Planter: పాత, విరిగిన కుర్చీలను పడేసేకన్నా ఇలా మొక్కల కోసం వాడేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved