నీళ్లను ఎక్కువగా తాగేస్తే ఆ సమస్యలొస్తయ్ జాగ్రత్త..
మన శరీరానికి నీళ్లు చాలా అవసరం. అందుకే నీళ్లను ఎక్కువగా తాగాలని చెప్తుంటారు. అలా అని నీళ్లను మరీ ఎక్కువగా తాగేస్తే మాత్రం డేంజర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
మన శరీరానికి నీళ్లు అవసరం కాదు.. అత్యవసరం. అన్నం లేకుండా నెలరోజులైనా ఉంటారేమో కానీ.. నీళ్లు లేకుండా వారం కూడా బతకలేరు. నీళ్లతోనే మన శరీరంగా ఆరోగ్యంగా పనిచేస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ఈ నీటిని ఒకేసారి కాకుండా.. అప్పుడప్పుడు కొన్ని కొన్నిగా తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయం తెలియక చాలా మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని తాగుతుంటారు. నీళ్లు జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కానీ నీళ్లను ఎక్కువగా తాగితే మాత్రం మూత్రపిండాల సమస్యలు వస్తాయి. అసలు నీటిని ఎక్కువగా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు శరీరంలో మంట కలుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అవసరమైన వాటికంటే నీళ్లను మరీ ఎక్కువగా తాగేస్తే శరీరంలో సోడియం, ఎలక్ట్రోలైట్ల పరిమాణం చాలా తగ్గుతుంది. దీనివల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే వాపు శరీర కణజాలాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల మాటిమాటికి టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు విరేచనాల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో విపరీతమైన అలసట కలుగుతుంది. కడుపులో నొప్పి కూడా పుడుతుంది. డీహైడ్రేషన్ ఎలా అయితే ప్రమాదకరమో.. ఓవర్ హైడ్రేషన్ కూడా శరీరానికి ప్రమాదకరం.
యుఎస్ నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ చేసిన ఒక పరిశోధన ప్రకారం.. 20 కిలోల బరువుకు ఒక లీటర్ నీటిని తాగాలి. ఈ లెక్కన చూస్తే ప్రతి 20 కిలోలకు లీటర్ చొప్పున నీటిని తాగాల్సి ఉంటుంది. 40 కిలోలు ఉంటే 2 లీటర్ల నీటిని తాగాలన్న మాట. అయితే గర్భిణీ స్త్రీలు నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. జ్వరం, వాంతుల సమస్యను ఫేస్ చేసే వారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి. ఎందుకంటే ఈ సమయంలో బాడీ డీహైడ్రేట్ అవుతుంది.
ఉదయం పరిగడుపున నీళ్లను తాగితే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. పెద్దపేగు క్లీన్ అవుతుంది. అలాగే పోషకాలు బాగా గ్రహించబడతాయి. మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు నీళ్లు మీరు సులువుగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు పోతాయి. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెమరిపోతుంది. రక్తం శుద్ధి అవుతుంది. పలు పరిశోధన ప్రకారం నీరు కూడా కేలరీలను కరిగిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.