Health Tips: ఉప్పు, చక్కెరను ఎక్కువగా ఎందుకు తినకూడదో తెలుసా..?
Health Tips: ఉప్పును గానీ చెక్కెరను గానీ మోతాదులో తింటేనే ఆరోగ్యం అన్ని విధాలా బావుంటుంది. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శరీరం సజావుగా పని చేయడంలో ఉప్పు, చక్కెరలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఉప్పు ఒక ఖనిజం. ద్రవాన్ని కొలవడానికి మరియు కండరాల సంకోచాలను నియంత్రించడానికి ఇది చాలా అవసరం. చక్కెర కార్బోహైడ్రేట్ యొక్క ఒక రూపం. ఇవి మోతాదులో తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. మితిమీరి తింటేనే ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్లమవుతాం.
ఏదేమైనా ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. రెడీ-టు-ఈట్ మీల్స్, నూడుల్స్, జున్ను, చిప్స్ వంటి సాల్టెడ్ స్నాక్స్ మరియు బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు లేదా ఊరగాయలు, జామ్ వంటి ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా మీ శరీరంలోకి ఉప్పు వెళుతుంది.
గురుగ్రామ్లోని క్లౌడ్నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ శివానీ బైజాల్ మాట్లాడుతూ.. షేక్స్, పండ్ల రసాలు, క్యాండీలు మరియు స్వీట్లకు.. చక్కెరను ఎక్కువుగా జోడించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఉప్పు , చక్కెర తీసుకోవడం తగ్గించడమే కాకుండా ఇతర అనేక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలంటే ఇలా చేయండి..
డైనింగ్ టేబుల్ మీద టేబుల్ సాల్ట్ షేకర్లను ఉపయోగించడం మానుకోండి.
ప్రొడక్ట్ కొనుగోలు చేసే ముందు ఫుడ్ లేబుల్స్ ను తప్పకుండా చూడాలి.
సాల్టెడ్ స్నాక్స్ వినియోగాన్ని పరిమితం చేయండి.
ప్యాక్డ్ ఫుడ్స్ కంటే ఇంట్లో వండిన ఆహారాలనే తినండి.
ప్రాసెస్ చేసిన, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి.
ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే జబ్బులు.. గుండె పోటు, అంధత్వం, బ్రెయిన్ స్ట్రోక్, Kidney failure,Heart failure, హైపర్ టెన్షన్, కాలెయం దెబ్బతినడం వంటి జబ్బుల పాలయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జబ్బులన్నీ దీర్ఘకాలం పాటు ఉప్పును ఎక్కువగా తినడం వల్లే వస్తాయట. అలా అని ఉప్పును పూర్తిగా తినకపోయినా గానీ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సోడియం కంటెంట్ ను తక్కువ మొత్తంలో తీసుకోండి.
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే జబ్బులు.. షుగర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. స్థూలకాయం బారిన పడితే మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక డయాబెటీస్ పేషెంట్లు షుగర్ ను ఎక్కువగా తీసుకుంటే మాత్రం వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుంది. అలసటగా కూడా ఉంటారు. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. డిప్రెషన్ బారిన పడొచ్చు కూడా. చర్మ సమస్యలు కూడా వస్తాయి. బీపీ కూడా పెరుగుతుంది. పంటి సమస్యలు వస్తాయి.