Health Tips: కాఫీ తాగే ముందు ఈ ఆహారాలను అస్సలు తినకూడదు.. లేదంటే మీ పని మటాషే..!
Health Tips: టీ కంటే కాఫీని ఇష్టపడే వారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే ఈ కాఫీ తాగేముందు కొన్ని వస్తువులను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

కాఫీని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరేమో. కొంతమందైతే కాఫీని తమ ఆహారంలో ఒక భాగంగానే భావిస్తారు. మోతాదులో కాఫీని తాగడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు కానీ.. కాఫీ తాగడానికి ఒక గంట ముందు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
calcium
కాల్షియం ఉన్న ఆహారాలు.. కాఫీని తాగడానికి ఒక గంట ముందు కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి కాల్షియం వల్ల కాఫీలో ఉండే కెఫిన్ శోషించుకోబడదు. దాంతో అది మూత్రం గుండా బయటకు పంపబడుతుంది. అలాంటి పరిస్థితిలో మీ శరీరం కెఫిన్ ప్రయోజనాన్ని పొందలేదు.
ఆయిలీ ఫుడ్స్ తీసుకోకూడదు.. ఆరోగ్య నిపుణులు నిఖిల్ వత్స ప్రకారం.. కాఫీని తాగే ముందు ఆయిలీ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదని సలహానిస్తున్నారు. ఎందుకంటే కాఫీకి ముందుగా వీటిని తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇలాంటి తప్పులు చేయకూడదు.
జింక్ అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు.. కాఫీకి ముందుగా జింక్ ఎక్కువ మొత్తంలో ఉండే ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిని తిన్న తర్వాత మీరు కాఫీ తాగితే.. వెంటనే మీ శరీరంలో జింక్ కలిగి ఉన్న ఆహారాలను బయటకు పంపుతుంది. ఇది మీ శరీరాన్ని దెబ్బతీస్తుంది.
ఇనుము అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు.. ఇదే సమయంలో కాఫీ తాగే ముందు ఇనుము పుష్కలంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ జింక్ బఠాణీలు, గింజలు, లెంటెడ్ సి, సెసర, చిక్పీస్ వంటి వాటిలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
vitamin k
అలాగే విటమిన్ డి నుంచి కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే విటమిన్ కె ఉన్న ఆహారాలను కూడా తినకూడదు. ఒక వేల తింటే మీరు కాఫీ తాగిన ప్రయోజనం కూడా ఉండదు.
కాఫీ ప్రయోజనాలు.. కాఫీని రోజుకు రెండు మూడు కప్పులకు మించి అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇంతకు మించితే మన శరీరంలో కెఫిన్ ఎక్కువయ్యి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాఫీ తాగడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవ్వడమే కాదు.. బాడీకి ఎనర్జీ కూడా వస్తుంది. ఒత్తిడడి, అలసట మటుమాయం అవుతాయి.