లిప్ స్టిక్ ను ఓవర్ గా పెట్టుకుంటున్నారా? అదెంత డేంజరో తెలుసా?
కొంతమంది ఆడవారు లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండరు. ఇంట్లో కూడా లిప్ స్టిక్ పెట్టుకునే ఉంటారు. లిప్ స్టిక్ అంటే అంత పాణం వీళ్లకు. కానీ దీన్ని మరీ ఓవర్ గా పెట్టుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెరపై కనిపించే వాళ్లే కాదు.. సాధారణ జనాలు కూడా మేకప్ లు వేసుకుంటున్నారు. అందులో ఏది ఉన్నా లేకున్నా.. పెదాలకు ఎర్రని లిప్ స్టిక్ మాత్రం పక్కాగా ఉండాల్సిందే. ఇది జస్ట్ రంగే అయినా.. దీనివల్ల ముఖం మొత్తం వెలిగిపోతుంది. అందం రెట్టింపు అవుతుంది. అందుకే కొంతమంది ఆడవాళ్లు లిప్ స్టిక్ లేకుండా బయటకు కూడా అడుగు పెట్టరు. ఈ లిప్ స్టిక్ మిమ్మల్ని అందంగా తయారుచేసినా.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులో మోతాదుకు మించి ఓవర్ గా పెట్టుకుంటే ప్రమాదకరమైన రోగాలు వస్తాయన్న ముచ్చట మీకు తెలుసా..? ఒక పరిశోధన ప్రకారం.. లిప్ స్టిక్ అప్లై చేసి.. ఆ లిప్ స్టిక్ ను సెట్ చేయడానికి పదే పదే పెదాలను అటూ ఇటూ కదిపే మహిళలల కడుపులోకి 87 మి.గ్రా లిప్ స్టిక్ వెళుతుందట. లిప్ స్టిక్ ను ఎక్కువగా అప్లై చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం పదండి..
చాలా లిప్ స్టిక్స్ లల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి మీ పెదాలను నల్లగా, పొడి బారేలా చేస్తాయి. అంతేకాదు లిప్ స్టిక్ లో లేట్ న్యూరోటాక్సిన్స్ ఉంటాయి. ఇది పెదవులకు మంచిది కాదు. అంతేకాదు వీటిలో మాంగనీస్, లెడ్ కాడ్మియం వంటి రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. ఇవి మీ పెదాలను దెబ్బతీస్తాయి.
ఎక్కువ లిప్ స్టిక్ ను వాడటం వల్ల పెదవులు నల్లగా మారతాయి. మీరు గమనించారో లేదు ఎక్కువగా లిప్ స్టిక్ ఉపయోగించే వ్యక్తులు పెదవులపై ఒక పై పొర ఉంటుంది. ఇది ముదురు రంగులో ఉంటుంది. పెదవుల లోపలి భాగం అలా ఉండదు. ఓవర్ గా లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వల్లే ఇలా జరుగుతుంది.
लिपस्टिक लगाने का सही तरीका
లిప్ స్టిక్ ను ఎక్కువగా పెట్టడం వల్ల పెదాలే కాదు.. పొట్ట, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే పెదవులకు లిప్ స్టిక్ అప్లై చేసినప్పుడు.. వాటిని నాలుకతో తాకడం, తడపడం వల్ల నోట్లో నుంచి కడుపులోకి వెళుతుంది. దీంతో పొట్ట, మూత్రపిండాలు దెబ్బతింటాయి.
చాలా మంది ఆడవారు లిప్ స్టిక్ ను ఐషాడో లేదా బ్లషర్ గా కూడా వాడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే లిప్ స్టిక్ లో ఉండే రసాయనాలు కళ్లలో ఇన్ఫెక్షన్ ను దారితీస్తాయి. అలాగే కళ్లలో చిరాకును కలిగిస్తాయి. ఎర్రగా మారుస్తాయి.
lipstick
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు లిప్ స్టిక్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే లిప్ స్టిక్ లో ఉండే పదార్థాలు కడుపులో బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావాలన్ని చూపెడుతాయి.
లిప్ స్టిక్ అప్లై చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి..
- ఒకవేళ మీకు లిప్ స్టిక్ వాడే అలవాటు ఉంటే.. ఎప్పుడూ కూడా హెర్బల్ లిప్ స్టిక్ నే ఉపయోగించండి. దీనిలో కెమికల్ కలర్స్ ఉండవు. నేచురల్ కలర్స్ మాత్రమే ఉంటాయి.
- ముఖ్యంగా డార్క్ కలర్ లిప్ స్టిక్ ను ఎక్కువగా అప్లై చేయడం చేయకండి.
- లిప్ స్టిక్ అప్లై చేయడానికి ముందు మీ పెదాలను బాగా మాయిశ్చరైజ్ చేయండి.
- నిద్రపోయే ముందు లిప్ స్టిక్ ను రిమూవ్ చేయాలి. ఆ తర్వాత వాసెలిన్ లేదా ఏదైనా పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం మర్చిపోకండి.
- మీ పెదాలను వారానికి కనీసం 2 సార్లు Exfoliate తప్పకుండా చేయాలి. ఇందుకోసం పంచదార, తేనెను ఉపయోగించి పెదవులపై మసాజ్ చేయండి. ఇది మీ పెదవుల్లోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.