ఆపిల్ సైడర్ వెనిగర్ మిమ్మల్ని నపుంసకులుగా చేయొచ్చు.. జర జాగ్రత్త..
ఆయుర్వేదం ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల నపుంసకులుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆపిల్ సైడర్ వెనిగర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక ఔషధం లాంటిది. అయినప్పటికీ..దీన్ని మితంగానే తీసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆల్కలీన్ వర్గానికి చెందినది. దీనిని తీసుకోవడం వల్ల చికాకు పెడుతుంది. అంతేకాదు దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. అలాగే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ దుష్ప్రభావాలు
ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె, కాలేయం, కడుపు, ప్రేగులు, చర్మం, జుట్టు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం.. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అంధత్వం, బట్టతల, తెల్ల జుట్టు, గుండె జబ్బులు, నపుంసకత్వానికి దారితీస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ను రోజూ తీసుకోవడం వల్ల ఈ దుష్ప్రభావాలు కూడా వస్తాయి:
కడుపులో సమస్యలు, గుండెల్లో మంట
చిగుళ్ల వాపు, గొంతులో చికాకు, గొంతులో మంట
అలర్జీ, కడుపులో మంట మొదలైన సమస్యలు కూడా వస్తాయి
యాపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar) లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు పాదాల దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతాయి. ఇది పాదాల దగ్గర ఉన్న బ్యాక్టీరియాను (Bacteria) నశింపచేసి దుర్వాసనను తగ్గిస్తుంది. కనుక ఒక బకెట్ లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో యాపిల్ సైడర్ వెనిగర్ ను వేసి ఆ నీటిలో పాదాలను ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనాలు
ప్రతిరోజూ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నేరుగా తీసుకోకూడదు. దీన్ని నీటితో మిక్స్ చేసి.. దానితో పండ్లు, కూరగాయలను కడగొచ్చు. ఇది పండ్లు, కూరగాయలపై ఉన్న కెమికల్స్ ను, మురికిని తొలగిస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది.
అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
గుండెను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
చర్మ సమస్యలను పోగొడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
అజీర్థి సమస్య కూడా పోతుంది. పెద్ద వయసులో వచ్చే లక్షణాలు తొలగిపోతాయి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ను సరైన మార్గంలో ఉపయోగిస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. లేకపోతే ప్రాణాల మీదికే రావొచ్చు.