- Home
- Life
- వాయు కాలుష్యం వల్ల ఒక్క ఊపిరితిత్తుల వ్యాధులే కాదు.. కీళ్ల వాపు, గుండె జబ్బులు వంటివెన్నో వస్తాయి జాగ్రత్త..
వాయు కాలుష్యం వల్ల ఒక్క ఊపిరితిత్తుల వ్యాధులే కాదు.. కీళ్ల వాపు, గుండె జబ్బులు వంటివెన్నో వస్తాయి జాగ్రత్త..
దేశమంతటా వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ వాయు కాలుష్యం సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వ్యాధులను కలిగిస్తుంది. అంతేకాదు మెదడు, గుండె, కళ్ళు, చర్మం, అనేక అవయవాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.

వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులే కాదు ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. వాయు కాలుష్యం వల్ల కలిగే వ్యాధుల కారణంగా ప్రతి ఏటా లక్షల మంది చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. నగరాల, గ్రామీణ ప్రాంతాలు అంటూ తేడా లేకుండా వాయు కాలుష్యం ప్రతి చోటు ఉంది. ఈ వాయు కాలుష్యం ఊపిరితిత్తుల వైఫల్యానికి మాత్రమే కాకుండా స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతోంది. ఈ వాయు కాలుష్యం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయో తెలుసుకుందాం పదండి..
వాయు కాలుష్యం ఊపిరితిత్తులను ఎలా ప్రభావితం చేస్తుందో మనందరికీ తెలుసు. ఇది ఒక్క ఊపిరితిత్తులకు మాత్రమే పరిమితం కాలేదు.ఈ కాలుష్యం మన గుండె, మెదడు, కళ్లు, చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
ఆర్థరైటిస్
వాయు కాలుష్యం, స్వయం ప్రతిరక్షక వ్యాధుల మధ్య సంబంధం ఉందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. వాయు కాలుష్యానికి గురవ్వడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల్లో వాపు సమస్య పెరుగుతుందట.
గుండెకు మంచిది కాదు
వాయు కాలుష్యం మన గుండెను కూడా ప్రభావితం చేస్తుంది. కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా వాయు కాలుష్య కణాలు ఊపిరితిత్తులకు, గుండెకు వెళ్లే రక్తప్రవాహంలోకి వెళతాయి. దీనివల్ల గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది.
మెదడును ప్రభావితం చేస్తుంది
గాలిలోని కాలుష్యం వల్ల మెదడు కూడా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఈ వాయు కాలుష్యం వృద్ధుల మెదడుపై చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. దీనివల్ల చాలా మందికి మాట్లాడటానికి రావు. అంతేకాదు చిన్న చిన్న లెక్కలను కూడా చేయలేకపోతారు. గొంతులోపలి నుంచి మాటలు బయటకు రావు.
చర్మంపై ప్రభావం
కలుషితమైన గాలి మన చర్మం పై తేమ లేకుండా చేస్తుంది. దీనివల్ల స్కిన్ డ్రై గా మారుతుంది. దీనివల్ల చర్మం చికాకు పుడతుంది. ఎర్రగా మారుతుంది. తామర వంటి సమస్యలు కూడా వస్తాయి. కలుషితమైన గాలిలో ఉండే కణాల వల్ల చర్మం ఎక్కువగా మారుతుంది.
గర్భిణులకు మంచిది కాదు
గర్భిణులు కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. దీనివల్ల పిల్లలు నెలల నిండక ముందే పుట్టడం, బరువు తక్కువ ఉండటం వంటివి జరుగుతాయి. అందుకే గర్భిణులు స్వచ్ఛమైన గాలినే పీల్చాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెల్లకపోవడమే మంచిది.
కళ్ళకు సంబంధించిన సమస్యలు
కాలుష్య స్థాయిలు పెరుగుతున్న కొద్దీ కొంతమందికి కంటికి సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతుంటాయి. ముఖ్యంగా కళ్లు ఎర్రబారడం, కళ్లు పొడిబారడం, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.