వావ్.. స్ట్రెస్ బాల్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?
ఒత్తిడిని తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొంచెం కూడా తగ్గదు. ఒకవేళ మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు పెద్దగా కష్టపడకుండా ఒత్తిడిని తగ్గించుకోవాలంటే.. వెంటనే స్ట్రెస్ బాల్ ను ప్రెస్ చేయండి చాలు..
స్ట్రెస్ బాల్స్ సాధారణంగా ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడానికి ఎంతో ఉపయోపడతాయి. ఈ స్ట్రెస్ బాల్స్ ను ప్రెస్ చేయడం వల్ల ఒక్క ఒత్తిడే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్ట్రెస్ బాల్ ను నొక్కినప్పుడు మీ నరాలు, కండరాలు ఉత్తేజపడతాయి. అలాగే సంకోచిస్తాయి. దీనివల్ల వీటి బలం పెరుగుతుంది. బలం మంత్తం మీ నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది అనవసరమైన హార్మోన్లను తగ్గిస్తాయి. ఒత్తిడి స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
స్ట్రెస్ బాల్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది
భావోద్వేగాలు స్థిరంగా ఉంటాయి
ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి
రక్తపోటు తగ్గుతుంది
ఏకాగ్రత, సృజనాత్మకత మెరుగుపడుతుంది
కండరాలు బలోపేతం అవుతాయి
శరీర శక్తి పెరుగుతుంది
నిద్ర మెరుగుపడుతుంది
రక్తప్రసరణ మెరుగుపడుతుంది
రక్తప్రసరణ మెరుగుపడటానికి స్ట్రెస్ బాల్స్ ను ఉపయోగించాలని చాలా మంది వైద్యులు చెబుతుంటారు. ఈ బాల్స్ ను నొక్కడం వల్ల మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. అలాగే మెదడులోని ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా మీ గుండె గట్టిపడుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. రక్తప్రసరణ ఎంత మెరుగ్గా ఉంటే గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. రక్తపోటును, గుండె జబ్బులు ఎక్కువయ్యే ప్రమాదాన్ని నివారించడానికి స్ట్రెస్ బాల్స్ ఎంతో సహాయపడతాయి.
మరిన్ని ప్రయోజనాలు
స్ట్రెస్ బాల్స్ ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. మీకు తెలుసా వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నట్టైతే.. మీలో టెన్షన్ తగ్గడాన్ని గమనించే ఉంటారు. మీరు ఆందోళన చెందడం మొదలుపెడితే మీ మెదడు హైపర్వెంటిలేటింగ్ పొందడం ప్రారంభిస్తుంది. దీంతో మీ శరీరం ఆడ్రినలిన్ ను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మీ హార్ట్ రేట్ బాగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో స్ట్రెస్ బాల్ ను నొక్కడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. చెడు ఆలోచనలన్నీ తొలగిపోతాయి.
స్ట్రెస్ బాల్స్ ను రెగ్యులర్ గా నొక్కడం వల్ల మీ కండరాల బలం పెరుగుతుంది. ముఖ్యంగా ఇది చేతులు, మణికట్టు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీరు చేసే పనితో సంబంధం లేకుండా అలసిపోయినట్టుగా ఫీలైనప్పుడు, చిరాకుగా అపించినా, విసుగొచ్చినా వెంటనే స్ట్రెస్ బాల్ ను ప్రెస్ చేయండి. ఇది మీ మనస్సును రిలాక్స్ చేస్తుంది.
టైపింగ్ చేయడం, రాయడం, సంగీత వాయిద్యాలను వాయించడం వంటి కొన్ని కార్యకలాపాల చేతివేళ్లు నొప్పి పెడతాయి. అయితే క్రమం తప్పకుండా స్ట్రెస్ బాల్ ను నొక్కడం వల్ల చేతులకు, వేళ్లకు మంచి వ్యాయామం అవుతుంది. ఇది మీ రోజువారి గాయాలను, నొప్పులను తగ్గిస్తుంది. స్ట్రెస్ బాల్ ఒక్క వేళ్లనే కాదు.. మీ మొత్తం శరీరాన్ని ఉత్తేజ పరుస్తుంది. మొత్తంగా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.