ఊదారంగు క్యాబేజీని తింటే బోలెడు లాభాలున్నాయి తెలుసా..
ఊదారంగు క్యాబేజీలో 28 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కంటి నుంచి ఎముకల వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి.

Purple Cabbage
పర్పుల్ కలర్ లో ఉండే క్యాబేజీని చూసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. నిజానికి ఆకుపచ్చ క్యాబేజీ కంటే పర్పుల్ క్యాబేజీలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఊదారంగు క్యాబేజీ 'బ్రాసికేసి' కుటుంబానికి చెందినది. ఒక కప్పు అంటే 89 గ్రాముల పర్పుల్ క్యాబేజీలో కేవలం 28 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంటే దీనిని తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ కూరగాయ అని చెప్పొచ్చు. 89 గ్రాముల పర్పుల్ క్యాబేజీలో 7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల డైటరీ ఫైబర్స్, 1 గ్రా ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, ఐరన్ , మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.
Purple Cabbage
ఈ పర్పుల్ కలర్ క్యాబేజీలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది. ఇది కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించి .. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ క్యాబేజీలోని పోషకాలు మీరు పెద్దయ్యాక కూడా ఎలాంటి కంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి వీటిని సలాడ్స్ తో పాటు పచ్చిగా తినండి. ఈ పర్పుల్ క్యాబేజీ లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని తరచుగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
cabbage
ఈ క్యాబేటీజీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలను పోగొడుతుంది. విటమిన్ల భాండాగారమైన ఊదారంగు క్యాబేజీని రెగ్యులర్ గా తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, ఇతర ఖనిజాలు ఎముకలు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి.
গ্রিলড চিকেনের ছবি
ఊదారంగు క్యాబేజీ అల్సర్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది. దీనిలో గ్లూటామైన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు పూతల వల్ల కలిగే మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ క్యాబేజీని జ్యూస్ గా తాగడం వల్ల అల్సర్స్ ను తగ్గిపోతుంది. ఈ క్యాబేజీలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
cabbage
పర్పుల్ కలర్ క్యాబేజీలో విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఇది కణాలలో జీవక్రియకు సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియను మెరుగుపడుతుంది. ఈ క్యాబేజీలో కేలరీలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ క్యాబేజీని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని తాజాగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.