MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Papaya Benefits: బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయిని తింటే ఇన్ని జబ్బులు తగ్గుతాయా..?

Papaya Benefits: బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయిని తింటే ఇన్ని జబ్బులు తగ్గుతాయా..?

Papaya Benefits: అల్పాహారం (Breakfast)లో బొప్పాయిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 12 2022, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బొప్పాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఔషద గుణాలు కడుపుకు సంబంధించిన ఎలాంటి రోగాన్నైనా తగ్గిస్తాయి. అయితే  బొప్పాయిని బ్రేక్ ఫాస్ట్ లో తినడానికి సంకోచిస్తుంటారు. ఇలా తింటే ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని భయపడుతుంటారు. నిజానికి బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వాస్తవానికి బొప్పాయి పండును తినడానికి ఉత్తమ సమయం ఉదయ అల్పాహారమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉటాయి. ఇవి అధిక బరువును తగ్గిండానికి ఎంతో సహాయపడతాయి. ఈ పండును బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అవేంటంటే.. 
 

38

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ (Fiber content)ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ (Cholesterol) ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.  బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయిని బ్రేక్ ఫాస్ట్ లో తింటే చక్కటి ఫలితం ఉంటుంది. 

48

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:  బొప్పాయిని కూడా చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయిని తీసుకోవడం వల్ల ల చర్మం మెరిసిపోతుంది. దీనిని యాంటీ ఏజింగ్ గా కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు బొప్పాయి ఆకులను మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు కూడా ఉపయోగిస్తారు. 

58

డెంగ్యూ రోగుల్లో ప్లేట్ లెట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరు బొప్పాయి ఆకులను తింటే ఈ సమస్య నుంచి బయటపడతాయి. బొప్పాయి ఆకులు సంజీవని లానే పనిచేస్తాయి. 

68

పొట్టను శుభ్రంగా ఉంచుతుంది: ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయిని తినడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. బొప్పాయి యొక్క తాజాదనం కడుపుకు మేలు చేస్తుంది. అంతేకాదు దీనిలోని చలువ చేసే గుణం.. కడుపును చల్లగా ఉంచుతుంది. ఉదర సంబంధ సమస్యలున్న వారు రెగ్యులర్ గా బొప్పాయిని తినండి. 

78
Papaya

Papaya

బొప్పాయి (papaya) ఒక సూపర్ ఫుడ్. దీనిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అనేక పోషకాలు లభిస్తాయి. దీన్ని తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

88

ఇది జీర్ణక్రియ, బరువు పెరగడం, మధుమేహం, క్యాన్సర్, కొలెస్ట్రాల్, బీపి వంటి వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ పండు మనకు సంవత్సరం పొడుగునా అందుబాటులో ఉంటుంది. కాబట్టి చాలా మంది దీనిని క్రమం తప్పకుండా తినడానికి ఇష్టపడతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Skipping Dinner Effects: రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Blouse Designs: స్టైలిష్ లుక్ కోసం ఈ బ్లౌజులు ట్రై చేయాల్సిందే!
Recommended image3
Hair Styles: స్కూల్ కి వెళ్లే పిల్లల కోసం స్టైలిష్ హెయిర్‌ స్టైల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved